Attack on Lawyer: పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు.. బహిరంగంగా లాయర్‌పై కత్తులతో దాడి.. వీడియో

|

Jul 19, 2021 | 1:00 PM

Attack on Lawyer: ఆర్థిక రాజధాని ముంబైలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. లాయర్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో న్యాయవాదికి తీవ్రగాయాలయ్యాయి. ముంబైలోని

Attack on Lawyer: పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు.. బహిరంగంగా లాయర్‌పై కత్తులతో దాడి.. వీడియో
Attack On Lawyer
Follow us on

Attack on Lawyer: ఆర్థిక రాజధాని ముంబైలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. పట్టపగలే లాయర్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో న్యాయవాదికి తీవ్రగాయాలయ్యాయి. ముంబైలోని బోరివాలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సత్యదేవ్‌ జోషి అనే న్యాయవాదిపై కత్తులు, కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బహిరంగ ప్రాంతంలో వెంటపడి మరి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన దహిసర్ పశ్చిమ ప్రాంతంలో జరిగింది. దహిసర్ కందర్‌పాడ ప్రాంతంలో కొంతకాలం నుంచి కొంతమంది మధ్య భూ వివాదం జరుగుతోంది. ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవాడానికి ప్రయత్నిస్తుండటంతో.. దానిని అడ్డుకుంటున్నట్లు లాయర్ సత్యదేవ్ జోషి పేర్కొన్నారు. ఈ వివాదంలో ఒకరి పక్షాన తనపై కత్తితో బహిరంగంగా దాడి చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ఘటన ముంబైలో కలకలం సృష్టించింది. ఇరువర్గాల మధ్య భూ వివాదం, లాయర్‌పై ఎందుకు దాడి చేశారన్న అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

‘కిడ్నాప్ ఘటనతో’.. పాకిస్తాన్ నుంచి తమ రాయబారి సహా దౌత్యాధికారులను వెనక్కి పిలిపించిన ఆఫ్గనిస్తాన్

Pegasus: పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది.. సంచలనంగా మారిన ఫోన్ల హ్యాక్‌