Beggar Murder: బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు.. కారణం ఏంటో తెలుసుకుని షాకైన పోలీసులు..!

Beggar Murder: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా భూ వివాదాలు, ఆర్థికలావాదేవీలు, ఇతర పగ ప్రతీకారాలతో హత్యలు జరుగుతుంటాయి. కానీ ఏపీలోని..

Beggar Murder: బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు.. కారణం ఏంటో తెలుసుకుని షాకైన పోలీసులు..!
Follow us

|

Updated on: May 06, 2022 | 3:16 PM

Beggar Murder: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా భూ వివాదాలు, ఆర్థికలావాదేవీలు, ఇతర పగ ప్రతీకారాలతో హత్యలు జరుగుతుంటాయి. కానీ ఏపీలోని గుంటూరు అర్బన్‌ (Guntur Urban) పరిధిలో మాత్రం ఓ బిచ్చగాడిని హత్య చేయడం కలకలం రేపుతోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ బిచ్చగాడిని దారుణంగా కొట్టి హత్య చేశారు. మరి బిచ్చగాడిని హత్య చేసే పనేముందనేగా మీ అనుమానం.. అసలు కారణాలు తెలుసుకున్న పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీరా బిచ్చగాడిని హత్యకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. గుంటూరు హోసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యక్తి స్థానికంగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మే 1న అర్ధ రాత్రి సమయంలో మహేష్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చి.. తనతో తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని బిచ్చగాడికి ఇచ్చాడు.

పొట్లం ఇస్తూనే.. నువ్వు చడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావ్, పోలీసులతో జాగ్రత్త అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. మహేష్ మాటలకు బాధపడ్డ బిచ్చగాడు మహేష్ ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని విసిరేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మహేష్.. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు అనిల్, సతీష్‌తో కలిసి వచ్చి బిచ్చగాడిని కొట్టారు. అది కూడా చాలదన్నట్టు బిచ్చగాడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకెళ్లి.. అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి ముగ్గుముగ్గరు కూడా విచక్షణ రహితంగా బిచ్చగాడిపై దాడి చేశారు. దెబ్బలు తాళలేక బిచ్చగాడు అక్కడికక్కడే మృతి చెందాడు. బిచ్చగాడు మృతి చెందిన విషయాన్నీ గమనించి మహేష్, అనిల్, సతీష్ అక్కడి నుంచి పరారయ్యారు. బిచ్చగాడి మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. మహేష్, అనిల్, సతీష్ లు స్థానికంగా ముఠా పనులకు వెళ్తుంటారని.. ఇడ్లి ఇస్తే తినలేదని కారణంతోనే మద్యం మత్తులో బిచ్చగాడని కొట్టినట్లు నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచామని డిఎస్పీ జెస్సి ప్రశాంతి తెలిపారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Hyderabad: కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన భార్య.. మనోవేదనతో భర్త ఏం చేశాడంటే..

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త సినిమాకి తీసుకెళ్లడానికి ‘నో’ చెప్పాడని భార్య ఆత్మహత్య

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు