Nellore Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు(Nellore) జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి..

Nellore Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident

Updated on: Feb 17, 2022 | 2:53 PM

నెల్లూరు(Nellore) జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఆటోను.. వరగలి క్రాస్‌ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ ఢీకొట్టింది. అనంతరం లారీ ఆటోను కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. గూడూరు సొసైటీ ప్రాంతానికి ఆటో డ్రైవర్ సుధాకర్‌.. ఆటోలోనే ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. మిగిలిన ఇద్దరు లారీ చక్రాల కింద పడి మరణించారు.

వీరు గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన మాతంగి రాజశేఖర్‌, హరిసాయిగా గుర్తించారు. వీరు ఓ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పని విషయం క్రమంలో సంస్థకు సంబంధించిన సరకులను దుకాణాలకు వేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మృతుల బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే తెలుగు/ డబ్బింగ్ సినిమాలు ఇవే..

Gateway IT Park: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయ ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌..

Akkineni Nagarjuna: మాట నిలబెట్టుకున్న హీరో అక్కినేని నాగార్జున.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున..