గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మోటర్ బైక్‌ను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్.. ముగ్గురు వ్యక్తులు మృతి

కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మోటర్ బైక్‌ను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్.. ముగ్గురు వ్యక్తులు మృతి

Updated on: Dec 02, 2020 | 9:46 AM

కర్నూలు జిల్లా గూడూరు సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సి.బెళగల్ మండలం బ్రాహ్మణ దొడ్డి నుంచి ఆర్.కానాపురం వెళ్తున్న మోటర్ బైక్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బ్రాహ్మణ దొడ్డి గ్రామానికి చెందిన కృష్ణ, గజ్జెలమ్మ, జానకమ్మగా గుర్తించారు. కూలీలు పత్తి తీసేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా, గూడూరులో రోడ్డుపై బైఠాయించారు మృతుల బంధువులు, గ్రామస్తులు. ముగ్గురు మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియన వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు