Road Accident: ఫ్యాన్స్ బెన్‌ఫిట్ షోకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అభిమానుల దుర్మరణం

|

Mar 25, 2022 | 8:47 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అభిమానుల కోసం ఆర్‌ఆర్‌ఆర్ బెన్‌ఫిట్ షో చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Road Accident: ఫ్యాన్స్ బెన్‌ఫిట్ షోకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అభిమానుల దుర్మరణం
Follow us on

AP Road Accident: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అభిమానుల కోసం ఆర్‌ఆర్‌ఆర్ బెన్‌ఫిట్ షో(RRR Benefit Show) చూసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని పేర్నమ్ బట్టు నుంచి వి.కోతకు వస్తుండగా.. పాపేపల్లి వద్ద రాత్రి ఒంటి గంట సమయంలో అదుపుతప్పి రెండు బైక్‌లు బలంగా ఢీకొన్నాయి. ఈ
ఘటనలో ప్రమాదస్థలంలోనే 25 ఏళ్ల దుర్గ అనే యువకుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు యువకులను కుప్పం పీ.ఈ.ఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 24 ఏళ్ల గంగాధర్, 26 ఏళ్ల వినయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. మృతి చెందిన యువకులు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాత్రి ఫ్యాన్స్ షో చూసేందుకు ఉత్సహంగా బైక్ లపై వచ్చిన యువకులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులు వీకోట మండలం బంగ్లా గ్రామం తుపాకీ వాండ్ల పల్లి కి చెందిన యువకులు.. ఉపాధి కోసం తమిళనాడు వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చూసేందుకు రెండు బైకుల్లో వి.కోటకు వచ్చారు నలుగురు యువకులు. నలుగురిలో ముగ్గురు మృతి చెందగా, రామకుప్పంకు చెందిన మరో యువకుడు కుప్పం పీఈఎస్ లో చికిత్స పొందుతున్నాడు.

Read Also….  Zodiac Signs: ఈ నాలుగు రాశుల అమ్మాయిల చేతి వంట అమృతం కంటే అద్భుతంగా ఉంటుందట.. ఆ రాశులేంటంటే..!