దొంగగా మారిన బీటెక్‌ విద్యార్థి..చివరకు అలా

|

Dec 18, 2019 | 7:28 PM

చెడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడిన బీటెక్‌ విద్యార్థి..ప్రేమించిన యువతి కోసం దొంగగా మారాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కొత్తపల్లి మండలం అస్నాయ్‌ గ్రామానికి చెందిన అజ్మీరా లక్ష్మణ్‌ అనే విద్యార్థి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎం. ఫార్మసీ చదువుతున్నాడు. ఉప్పల్‌ విజయపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా […]

దొంగగా మారిన బీటెక్‌ విద్యార్థి..చివరకు అలా
Follow us on
చెడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడిన బీటెక్‌ విద్యార్థి..ప్రేమించిన యువతి కోసం దొంగగా మారాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కొత్తపల్లి మండలం అస్నాయ్‌ గ్రామానికి చెందిన అజ్మీరా లక్ష్మణ్‌ అనే విద్యార్థి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎం. ఫార్మసీ చదువుతున్నాడు. ఉప్పల్‌ విజయపురి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రేమించిన అమ్మాయితో జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.
డబ్బుల కోసం దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఘట్‌కేసర్‌, మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో పరీక్షల సమయంలో విద్యార్థులు పార్క్‌ చేసిన స్కూటీల డిక్కీలు తెరిచి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లడం ప్రారంభించాడు. అందులో భాగంగానే నారపల్లిలోని నల్ల మల్లారెడ్డి కళాశాల ఆవరణలో టూవీలర్‌ వెహికిల్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్లు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా లక్ష్మణ్ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడి నుంచి 20 మొబైల్‌ ఫోన్లు, 2 ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. గతంలో ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.