VIjayawada Crime: పెట్రోల్ బంకులో చోరీ.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు

|

Feb 14, 2022 | 8:18 PM

విజయవాడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు పేట్రేగిపోతున్నాయి. రోజూ ఏదో ఓ ప్రాంతంలో చోరీ లు జరుగుతున్నాయి. ఈ ఘటనలతో నగర శివారు ప్రాంత..

VIjayawada Crime: పెట్రోల్ బంకులో చోరీ.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
Petrol Bunk Chori
Follow us on

విజయవాడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు పేట్రేగిపోతున్నాయి. రోజూ ఏదో ఓ ప్రాంతంలో చోరీ లు జరుగుతున్నాయి. ఈ ఘటనలతో నగర శివారు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గన్నవరంలోని ఓ పెట్రోల్ బంకులో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. లాకర్ లో ఉంచిన నగదును తస్కరించి, ఉడాయించాడు. సీసీ కెమెరాల్లో చోరీ ఘటన దృశ్యాలు నమోదయ్యాయి.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం బి.బి.గూడెం రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ లో చోరీ జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆగంతకుడు.. లాకర్, బ్యాగ్ లో ఉన్న రూ.4 లక్షల డబ్బులు తీసుకొని పరారయ్యాడు. చోరి జరిగిన విషయాన్ని గ్రహించిన బంకు యాజమాని తుమ్మల మురళి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.

 

Also Read

AP Crime: అదనపు కట్నానికి తల్లీ, కుమార్తె మృతి.. హత్యా..? ఆత్మహత్యా..?

Cyber Crime: గూగుల్ పే చేస్తామని.. లింక్ పంపించి.. అందిన కాడిని దోచుకున్నారు

AP Crime: వ్యాయామ ఉపాధ్యాయుడి కీచక బుద్ధి.. కోరిక తీరిస్తే కోరుకున్నది ఇస్తానని..