Crime News: కడపలో దారుణం.. చెల్లిని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు..

|

Oct 21, 2021 | 5:18 PM

ఆంధ్రప్రదేశ్‎లోని కడప నగరంలో దారుణం జరిగింది. ఓ తల్లి కూతురు మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అది చూసిన తనయుడు తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది....

Crime News: కడపలో దారుణం.. చెల్లిని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు..
Murder
Follow us on

ఆంధ్రప్రదేశ్‎లోని కడప నగరంలో దారుణం జరిగింది. ఓ తల్లి కూతురు మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అది చూసిన తనయుడు తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కడపలోని నకాష్ వీధిలో బుధవారం అర్ధరాత్రి తల్లీకూతుళ్ల హత్య జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. తల్లి కుషిదా మెడపై కత్తి గాట్లను గుర్తించారు. కూతురు అలీమా మెడకు చున్నీ బిగించి చంపిన ఆనవాళ్లను గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‎కు తరలించారు. హత్య ఎవరు చేశారనే దానిపై ముమ్మరంగా దర్యాప్తు చేశారు. మృతుల బంధువులను విచారించగా కుషిదాకు కొడుకు కూడా ఉన్నాడని అతడు కనిపించడం లేదని తెలిపారు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. చివరికి అతడిని పట్టుకున్నారు. అతడు చెప్పిన నిజాలతో పోలీసులు షాక్ అయ్యారు. కూతురు అలీమా నిత్యం ఫోన్ చూస్తుండటంతో బెదిరించడానికి తల్లి చున్నీతో ఉరి వేయబోయిందని.. హఠాత్తుగా ఉరి బిగుసుకు పోవడంతో అలీమా మృతి చెందిందని అతడు చెప్పాడు. చెల్లిని చంపిందని కోపంతో తను తల్లి కుషీదాను మెడపై కత్తితో పొడిచి పారిపోయానని తెలిపాడు.

Read Also.. Drugs Case: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. అనన్య పాండే, షారుఖ్ ఖాన్ ఇళ్లపై నార్కోటిక్స్ అధికారుల దాడులు..