అనారోగ్యంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు నమ్మించాడు.. కత్తితో పొడిచి హతమార్చాడు ఓ కసాయి భర్త

|

Feb 15, 2021 | 7:26 PM

బయ్యారం మండలంలోని నామాలపాడు గ్రామంలో జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచాడు. అంతేకాదు, ఆమె చనిపోకపోవడంతో గొంతునులిమి చంపేశాడు.

అనారోగ్యంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు నమ్మించాడు.. కత్తితో పొడిచి హతమార్చాడు ఓ కసాయి భర్త
Follow us on

Husband killed Wife : మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన బయ్యారం మండలంలోని నామాలపాడు గ్రామంలో జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచాడు. అంతేకాదు, ఆమె చనిపోకపోవడంతో గొంతునులిమి చంపేశాడు. నామాలపాడు గ్రామానికి చెందిన నరేష్ మహబూబాబాద్ మండలంలోని పెనుగొండ గ్రామానికి చెందిన సరితతో వివాహం జరిగింది. అయితే ఇటీవల భార్య సరిత అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళుతున్నామని చెప్పి నరేష్ తీసుకువచ్చాడు.

అనంతరం నామాలపాడు అడవిలోకి తన భార్య సరితను భర్త నరేష్ తీసుకువెళ్లాడు. అక్కడ భార్యను కత్తితో పొడిచాడు. అయితే, సరిత చనిపోలేదని నిర్థారించుకుని గొంతునులిమి హతమార్చాడు. ఆస్పత్రికి వెళ్లిన సరిత ఇంటి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆరా తీయడంతో అసలు కథ బయటకు వచ్చింది. కాగా, స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మ‌ృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. నరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  తాండూరులో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త, అత్తామామ వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు