Bridegroom Beaten up in Marriage: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రం చోటుచేసుకుంది. పెళ్లిపీటల మీదనే పెళ్లికొడుకును వధువు చెంప పగులగొట్టింది. అంతేకాదు, వివాహనానికి హాజరైన అతిథులతో కలిసి చితకబాది పోలీసులకు అప్పగించింది. యూపీకి చెందిన అమేథీలో ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాహం అనంతరం విందు సమయంలో వరుడు… వధువు తరపువారిని కానుకగా బుల్లెట్ వాహనం కావాలని అడిగాడు. అయితే, తనకు స్తోమత లేదని ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహంచిన గ్రామస్తులు అతన్ని బంధించి, చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడిని, అతని తండ్రిని అరెస్టు చేశారు.
అమేథీ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుమార్తెకు మొహమ్మద్ అమీర్ కుమారుడు ఇమ్రాన్ సాజ్‌తో వివాహం జరిగింది. అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో వరకట్నం కింద వరుడు బుల్లెట్ వాహనం కావాలని డిమాండ్ చేశాడు. అంత స్తోమత తమకు లేదని వధువు తండ్రి చెప్పాడు. అయితే, వరుడు బుల్లెట్ కోసం పట్టుపట్టాడు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదానికి దారితీసింది. ఇదంతా గమనించిన వధువు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా వరుడి చేయిచేసుకుని చెంప పగులగొట్టింది. అనంతరం గ్రామస్తులు వరుడిని బంధించి, చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో గంటల తరబడి చర్చ జరిగినా సమస్య కొలిక్కి రాలేదు. వరుడు విడాకులకు పట్టుబట్టాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also… BIDEN PROPOSAL: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి బైడెన్ శాశ్వత పరిష్కారం.. కొత్త ప్రతిపాదన ఇదే!