Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

Jammu & Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. రఖామా ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..
Encounter

Updated on: Oct 01, 2021 | 7:18 AM

Jammu & Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. రఖామా ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతుందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలతోపాటు పోలీసులు కూడా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. రఖమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. బుధవారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా, పలు ప్రాంతాల్లో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని, మిషన్ గన్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారు.

Also Read:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో జీతం పెంపుతో పాటు డబుల్‌ బోనస్‌ రానుందా?

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!