Hyderabad: దిశ తరహాలోనే ఎన్‌కౌంటర్‌ చేయండి.. చిన్నారి హత్యపై స్థానికుల తిరుగుబాటు.. సైదాబాద్‌లో ఉద్రిక్తత

|

Sep 10, 2021 | 10:41 AM

Saidabad Girl Rape Case: హైదరాబాద్ నగరం అంతటా వినాయక చవితి సందడి నెలకొంది. ఈ తరుణంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని

Hyderabad: దిశ తరహాలోనే ఎన్‌కౌంటర్‌ చేయండి.. చిన్నారి హత్యపై స్థానికుల తిరుగుబాటు.. సైదాబాద్‌లో ఉద్రిక్తత
Saidabad Girl Rape Case
Follow us on

Saidabad Girl Rape Case: హైదరాబాద్ నగరం అంతటా వినాయక చవితి సందడి నెలకొంది. ఈ తరుణంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఓ చిన్నారిపై ఉన్మాది కన్నేసి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా చంపాడు. ఆరేళ్ల చిన్నారి సాయంత్రం నుంచి కనిపించకుండా పోవటంతో.. కుటుంబసభ్యులు బస్తీ మొత్తం వెతకగా చివరికి పక్కింట్లో శవమై కనిపించింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దిశ ఘటన మాదిరిగానే.. నిందితుడిని కాల్చి చంపాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పోలీసులకు.. స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన హైదరాబాద్ లో కలకలం సృష్టించింది.

వివరాలు.. నల్గొండ జిల్లా చందంపేట మండలానికి చెందిన రాజు నాయక్ పొట్టకూటి కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు. రాజూనాయక్ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చైత్ర పెద్దమ్మాయి. రోజులాగే సాయంత్రం ఆడుకుంటూ బయటకు వెళ్లింది. అనంతరం కనిపించకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వేతకగా కనిపించలేదు. దీంతో స్థానిక మసీద్, చర్చిలో మైకుల ద్వారా ప్రచారం చేయించారు. అయినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సింగరేణి బత్తిని మొత్తం గాలించగా ఫలితం లేకుండా పోయింది. చివరికి సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.

అయితే ఇంటి పక్కనే నివసిస్తున్న రాజు అనే యువకుడు గత కొంత కాలంగా చెడు వ్యసనాలకు అలవాటై మద్యం మత్తులో జులాయిగా తిరుగుతూ చిల్లర దొంగతనాలు పాల్పడేవాడు. రోజు మద్యం సేవించి భార్యను తల్లిని పిల్లల్ని చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడు. దీంతో కొద్ది రోజుల క్రితం అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడి సైకో చేష్టలు భరించలేక తల్లి కూడా వెళ్ళిపోయింది. కొద్దిరోజులుగా ఒంటరిగా ఉంటున్న రాజు కూలీ పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో జల్సా చేస్తూ మద్యం తాగుతూ తిరుగుతుండేవాడు.

ఈ క్రమంలో పక్కింట్లో ఉండే రాజు చిన్నారి మీద కన్నేసాడు. సుమారు 30ఏళ్ల వయసున్న కీచకుడు మాయమాటలు చెప్పి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి బలాత్కారం చేసి చంపేశాడు. అనంతరం పరుపులో మూట కట్టి తాళం వేసి అక్కడినుంచి జారుకున్నాడు. అయితే ఇదంతా తెలియని స్థానికులు పాప కోసం వెతికి వెతికి ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు చిన్నారి నాయనమ్మకి పక్కింట్లో ఉండే రాజుపై అనుమానం వచ్చింది. అనంతరం స్థానికులు ఇంటి తాళం పగలగొట్టాలని ప్రయత్నించారు. మొదట వారించిన పోలీసులు అనుమానం బలపడటంతో 10 గంటల ప్రాంతంలో తాళం పగలగొట్టి చూడగా.. పరుపులో శవమై కనిపించింది.

దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని తమకు అప్పగించేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని పట్టుబట్టి ఆందోళనకు దిగారు. దిశ ఎన్‌కౌంటర్ మాదిరిగానే ఈ నిందితుని కూడా ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీఇచ్చారు. అయినప్పటికీ స్థానికులు వినలేదు. నిందితుడిని వెతికి తమకు అప్పగించాలని పట్టుబట్టారు. చివరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఉన్నతాధికారులు 300 మంది పోలీసులను రంగంలోకి దిగారు.

చివరకు పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు పోలీసులపై రాళ్లు, కర్రలు, మట్టి రేకులతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట లో 10ల సంఖ్యలో పోలీసులకు, స్థానికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పోలీసులతోపాటు, స్థానిక మహిళలు ఉన్నారు.

కాగా.. ఈ ఘటన అనంతరం శుక్రవారం ఉదయం హైదరాబాద్ కలెక్టర్ ఎల్ శర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ రెడ్డి సింగరేణి కాలనీకి చేరకున్నారు. రహదారిపై బైఠాయించిన చిన్నారి తల్లిదండ్రులు, సింగరేణి కాలనీ వాసులతో ఇరువురు మాట్లాడుతున్నారు. నిందితుడు రాజును ఎన్‌కౌంటర్ చేయాలంటూ సింగరేణి కాలనీ వాసులు వారితో పేర్కొన్నారు.

Also Read:

Hyderabad: హైదరాబాద్‌లో ఉన్మాది అరాచకం.. చిన్నారిపై కన్ను.. ఆ తర్వాత ఎత్తుకెళ్లి..

నడి రోడ్డుపై బాలుడి తల.. రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక పోలీసు బృందాలు.. మృతదేహం కోసం గాలింపు..!