Telugu Akademi: తెలుగు అకాడమీలో అసలేం జరిగింది? పోలీసుల విచారణలో వెలులోకి వస్తున్న సంచలనాలు!

|

Dec 04, 2021 | 8:16 AM

తెలుగు అకాడమీలో 64.5కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ధారించారు. అకాడమీలో అందరి పాత్ర ఉందని తేలింది. ఈ భారీ స్కాంలో నిధులను మళ్లించడమే కాకుండా.. ఆ సొమ్ములతో స్థిరాస్తును కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు.

Telugu Akademi: తెలుగు అకాడమీలో అసలేం జరిగింది? పోలీసుల విచారణలో వెలులోకి వస్తున్న సంచలనాలు!
Telugu Akadami
Follow us on

Telugu Akademi Deposits Case: తెలుగు అకాడమీలో 64.5కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ధారించారు. అకాడమీలో అందరి పాత్ర ఉందని తేలింది. ఈ భారీ స్కాంలో నిధులను మళ్లించడమే కాకుండా.. ఆ సొమ్ములతో స్థిరాస్తును కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు సంస్థల ఎఫ్‌.డి.లను కొల్లగొట్టడమే వారి టార్గెట్. వేలు, లక్షలు కాదు.. కోట్ల రూపాయలకు టెండర్ పెట్టింది సాయి కుమార్ అండ్ బ్యాచ్. ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, విచారణ సంస్థలు మొత్తం గుట్టును బయటపెట్టేపనిలో పడ్డారు అధికారులు.

తెలుగు అకాడమీలో 64.5కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అకాడమీలో అందరి పాత్ర ఉందని తేలింది. ఈ భారీ స్కాంలో నిధులను మళ్లించడమే కాకుండా.. ఆ సొమ్ములతో స్థిరాస్తును కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. అయితే, ఈకేసు సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో ఆరుగురు నిందితులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న సాయి కుమార్‌, వెంకటరమణ, సోమశేఖర్‌, వెంకట్‌, రమేశ్‌, సత్యనారాయణలను పోలీసులు సీసీఎస్‌కు తరలించారు. ఇవాళ, రేపు నిందితులను ప్రశ్నించనున్నారు.

తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5కోట్లు వాటాలుగా పంచుకున్న నిందితులు.. వాటిని ఎక్కడికి మళ్లించారనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు నిందితులకు సంబంధించిన కొన్ని ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. రూ.64.5 కోట్లకు లెక్క తేలకపోవడంతో డిపాజిట్ల గోల్‌మాల్‌లో కీలక పాత్ర పోషించిన నిందితులను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈకేసులో సీసీఎస్‌ పోలీసులు ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీళ్లంతా డబ్బును వాటాలుగా పంచుకొని పలుచోట్లు పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also….  Omicron Scare: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ మాస్క్ లేకపోతే ఫైన్.. వ్యాక్సినేషన్ లేకుంటే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో నో ఎంట్రీ