గొర్రెల, మేకల పెంపకందారుల ఆందోళన..రోడ్డెక్కి రాస్తారోకో

|

Oct 13, 2020 | 12:54 PM

తెలంగాణలో గొర్రెలు, మేకల పెంపకందార్లు రోడ్డెక్కారు. గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. కాపరులు తమ గొర్రెలు మేకలను రోడ్డు మీద ఉంచి రాస్తారోకో చేశారు.

గొర్రెల, మేకల పెంపకందారుల ఆందోళన..రోడ్డెక్కి రాస్తారోకో
Follow us on

తెలంగాణలో గొర్రెలు, మేకల పెంపకందార్లు రోడ్డెక్కారు. గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. కాపరులు తమ గొర్రెలు మేకలను రోడ్డు మీద ఉంచి రాస్తారోకో చేశారు. దీంతో హైదరబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై పెంబర్తి గ్రామ శివారు హైవేను గొర్రెలు, మేకలతో దిగ్బంధించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు.

గొర్రెల కాపరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి చౌరస్తా సూర్యాపేట – జనగామ ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం రెండవ విడత గొర్రెల పంపిణి చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రోడ్లను దిగ్బంధించారు.

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం తమను ఆదుకోవాలని గొల్ల కురుమలు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. జనగామ జిల్లాలో చేపట్టిన రోడ్ల దిగ్బంధం ఉద్రిక్తతలకు దారి తీసింది. రోడ్ల దిగ్బంధనంతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.