Hyderabad Road Accident: హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల రోడ్లు రక్తమోడుతున్నాయి. ఇక్కడ అ అక్కడ అన్న తేడా లేదు. నగర శివారులో, ఔటన్ రింగ్ మీద, నగరం నడిబొడ్డున ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఈ మరణాలకు కారణం అతివేగం, అజాగ్రత్త, మద్యం మత్తులో వాహనం నడపడం. మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు
తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో రాజేంద్రనగర్ ORR ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి నోవాటేల్ హోటల్ లో పబ్ లో పనిచేస్తున్న కాశీనాథ్ భార్య వైష్ణవి బర్త్ డే సందర్భంగా మిత్రులకు పార్టీ ఇచ్చాడు. అంతా కలిసి మద్యం సేవించారు. అదే పబ్ లో పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ కూడా పార్టీకి అటెండ్ అయ్యాక, అంత కలిసి సరదాగా బయటకి వెళ్లనుకున్నారు. ఫ్రెండ్ కి ఫోన్ చేసి ప్రేమ్ కార్ తెప్పించాడు. అందరు మధ్య మత్తులో ఉండటంతో డ్రైవర్ కి ఫోన్ చేశారు. దీంతో సుశీల్ గుప్తా సుమారు 12 గంటల ప్రాంతంలో కార్ తీసుకొని రాగా అందరూ సరదాగా ORR మీద శంషాబాద్ వెళ్లారు. తిరిగి వస్తుండగా ముందు వెళుతున్న లారీని వెనకనుంచి బలంగా ఢీ కొట్టారు. దీంతో స్పాట్లోనే ఒక వ్యక్తి చనిపోగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. అందరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీస్ లు. ఇందులో సుశీల్ గుప్తా తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఇక, ముందు సీట్లో కూర్చున్న కాశీనాథ్ భార్య వైష్ణవి కార్లో చిక్కుకోవడంతో సుమారు రెండు గంటల శ్రమించి క్రేన్ సహాయంతో బయటికి తీయడం జరిగింది. అయితే, డ్రైవర్ పనిచేస్తున్న సుశీల్ గుప్తాకి సుమారు 12 గంటల ప్రాంతంలో ఫోన్ రావడంతో AP13N5121 కార్ లో వెళ్లాడని ఉదయం ఎంతసేపటికీ రాకపోవడంతో ఫోన్ చేయగా పోలీసులు యాక్సిడెంట్ సమాచారం ఇచ్చారని అతని సోదరుడు తెలిపారు సంఘటన స్థలాన్ని పరిశీలించడం నిర్లక్ష్యం మరియు అతివేగం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఆక్సిడెంట్ టైంలో కార్ కనీసం 100 స్పీడ్ లో ఉండొచ్చు అని పోలీసులు అంటున్నారు. కారులో లో సిగరెట్ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లను క్లూస్ టీం సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.అందరూ మద్యం సేవించి నట్టుగా నిర్ధారణకు వచ్చిన పోలీస్ లు డ్రైవర్ సుశీల్ మద్యం సేవించడం లేదా అన్నది బ్లడ్ శాంపిల్స్ ద్వారా నిర్దారీటామని పోలీసులు అంటున్నారు
సుమారు నాలుగైదు గంటల ప్రాంతంలో హాస్పిటల్ హాస్పిటల్ వచ్చినప్పుడు పరిస్థితి క్రిటికల్ గానే ఉందని అప్పటికే డ్రైవర్ సుశీల్ గుప్త కి కార్డియాక్ అరెస్ట్ అవ్వటంతో టెంపరరీ వెంటిలేషన్ ద్వారా శ్వాస అందించామని. అతని కండీషన్ క్రిటికల్ గా ఉండటం, తలకి మల్టిపుల్ అవ్వటంతో అతని ఉస్మానియా కి తరలించామని అన్నారు. మిగిలిన గారికి ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్సలు జరుగుతున్నాయని, కొద్దిరోజుల్లో వాళ్లు కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు.
Read Also… అమెరికన్ ఆటో మేజర్ టెస్లా కార్ల తయారీపై నెటిజన్ల ప్రశంసలు !! వీడియో