Crime News: బాలికపై యువకుడి అఘాయిత్యం.. ఇంట్లో ఒంటరిగా ఉండగా బెదిరించి..

|

Jun 11, 2022 | 9:53 AM

మౌలి జాగరణ్‌ ప్రాంతానికి చెందిన యువకుడు.. మార్చి నెలలో పంచకులలోని బుద్దన్‌పూర్ గ్రామంలో ఇంట్లో ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనను బెదిరించి

Crime News: బాలికపై యువకుడి అఘాయిత్యం.. ఇంట్లో ఒంటరిగా ఉండగా బెదిరించి..
Representational Image
Follow us on

Chandigarh Police: నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా.. పంజాబ్‌లో రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడ్డాడు. ఈ ఘటన పంజాబ్లోని చండీఘడ్ మౌలి జాగరణ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలి జాగరణ్‌ ప్రాంతానికి చెందిన యువకుడు.. మార్చి నెలలో పంచకులలోని బుద్దన్‌పూర్ గ్రామంలో ఇంట్లో ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనను బెదిరించి మరోసారి తన ఇంట్లోనే జూన్ 8వ తేదీన లైంగిక దాడి చేశాడని, అలా పలుమార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే.. బాలికలో మార్పులను గమనించిన తల్లిదండ్రులు.. ఆమెను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత బాలిక, ఆమె తల్లి చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై ఐపీసీ సెక్షన్ 376(2), 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అయితే.. నేరస్థుడు బాలుడని తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నట్లు చండీఘడ్ పోలీసులు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. కిషన్‌గఢ్ గ్రామంలో బాలికను లైంగికంగా వేధించినందుకు ఆటో రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అదే గ్రామంలోని బాలికను నిందితుడు హరిశంకర్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు అందడంతో అతన్ని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..