సాధారణంగా ఓ టీ అమ్ముకునే వ్యక్తి, దుస్తులు ఇస్త్రీ చేసే వ్యక్తి ఎలాంటి వాహనాల్లో తిరుగుతారు.. సైకిల్ లేదా మహా అంటే మోటార్ సైకిల్‌పై తిరుగుతారు. కానీ అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఇవే పనులు చేస్తూ ఖరీదైన బీఎండబ్ల్యూ కొనుగోలు చేశారు. దీంతో స్థానికులు కూడా వీరి వైభోగం చూసి ఆశ్చర్యపోయారు. నిజంగానే అంత డబ్బు సంపాదించారేమోనని అనుకున్నారు. అయితే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వీరిని పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వారిని తమదైన శైలిలో విచారించడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులతో పాటు అందరూ షాకయ్యారు.
ఆత్మహత్య చేసుకుంటామంటూ..
పోలీసులు తెలిపిన వివరాల మేరకు అహ్మదాబాద్‌కు చెందిన యూసుఫ్ గంచి(36) టీ అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే నగరానికి చెందిన ఆరీఫ్ గంచి(27) దుస్తులు ఇస్త్రీ చేస్తూ బతుకు బండిని నడుపుతున్నాడు. అయితే డబ్బుపై విపరీతమైన ఆశ పెంచుకున్న వీరిద్దరూ కలిసి బ్లాక్‌మెయిల్ దందాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా పారిశ్రామిక వేత్తలకు ఫోన్లు చేసి కంపెనీ లైసెన్స్‌లు రద్దు చేయిస్తామని బెదిరిస్తారు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగుతారు. ఒకవేళ బాధితులు లొంగకపోతే ‘డబ్బులు ఇవ్వకుంటే సూసైట్ నోట్‌లో మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటాం’ అని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. కాగా సర్కేజ్ ప్రాంతానికి చెందిన జావెద్ గలేరియాను బెదిరించి ఇలాగే రూ.31.5 లక్షలు దోచుకున్నారు. అయితే అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ‘ఇప్పటివరకు 8 మంది బాధితులు వీరి బారిన పడ్డారు. పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకున్నారు. వీరే కాకుండా మరెవరైనా బాధితులు ఉన్నారేమోనని విచారిస్తున్నాం. ధైర్యంగా ఫిర్యాదు చేయమని కోరుతున్నాం’ అని డీసీపీ ప్రేమ్‌సుఖ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Also Read:
Ladies Safety: ట్రయల్ రూం ట్రబుల్స్… కెమెరా కళ్లు చూస్తున్నాయి జాగ్రత్త..
Viral News: తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని