Sangam Dairy Case: సంగం డెయిరీ కేసులో విచారణ వేగవంతం.. ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు

|

May 01, 2021 | 1:59 PM

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Sangam Dairy Case: సంగం డెయిరీ కేసులో విచారణ వేగవంతం..  ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు
Dhulipalla Narendra Kumar Five Days Into Acb Custody
Follow us on

Sangam Dairy Case: సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు, తన తండ్రిని కలిసేందుకు ధూళిపాళ్ల కూతురికి అధికారులు అనుమతి నిరాకరించారు.

సంగం డెయిరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను కోర్టు ముందు హాజరుపర్చగా, అనంతరం రాజమండ్రి జైలుకు రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయన్ను కస్టడీకి అప్పగించింది.

దీంతో ధూళిపాళ్లను ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. శనివారం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అలాగే, ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సంగం డెయిరీ లావాదేవీల్లో ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసులోధూళిపాళ్లను అక్రమంగా అరెస్ట్ చేశారని నరేంద్ర భార్య జ్యోతిర్మయి కంటతడి పెట్టారు. ధూళిపాళ్లను కలిసేందుకు ఏసీబీ కార్యాలయానికి న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ వచ్చారు. అయితే, పోలీసులు రామకృష్ణను ధూళిపాళ్ల నరేంద్రను కలవనీవకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత రామకృష్ణను ధూళిపాళ్లను కలుసుకోడానికి పోలీసులు అనుమతించారు..

Read Also…  Viral Photos: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రాలు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!