తమిళనాడు లో ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ చేసిన దొంగల ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. నేషనల్ హైవే నుంచి మధ్యప్రదేశ్ కు పారిపోతుండగా శంషాబాద్ తొండూపల్లి వద్ద దొంగలను ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ దొంగలు తెలంగాణ వైపుకు వెళ్లే అవకాశం ఉండడంతో సైబరాబాద్ పోలీసుల సహకారం కోరారు తమిళనాడు పోలీసులు. దీంతో అలర్ట్ అయిన సైబరాబాద్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
తమిళనాడులో దోపిడీ చేసిన అనంతరం బంగారం బ్యాగులను ఓ కంటైనర్ లో తరలిస్తూ దాని వెనకాలే దొంగలు ఫాలో అయ్యారు. తొండుపల్లి చెక్ పోస్ట్ వద్ద సిబ్బందిని అలర్ట్ చేయడంతో దోపిడీ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుండి 25 కిలోల బంగారు ఆభరణాలను, 7 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 12 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
చోరోకి సంబంధించిన విషయాలను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. నిన్న కృష్ణగిరి జిల్లాలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. చాలా తక్కువ సమయంలో దోపిడీ ముఠాను అరెస్ట్ చేశాం. తొండపల్లి టోల్‌ప్లాజా దగ్గర నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. కంటైనర్‌లో బంగారు అభరణాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన రూప్‌సింగ్ భాగాల్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించాం. మూడు నెలల క్రింతం లూథియానాలోని ముత్తూట్‌లో దోపిడీకి యత్నించారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు.