Tamil Nadu: యూట్యూబ్ వీడియో చూస్తూ యువతికి ప్రసవం.. హాస్పిటల్‌కు వెళ్లగా…

గర్భంతో ఉన్న వారికి పురిటినొప్పులు వస్తే సాధరణంగా ఏం చేస్తాం.. వెంటనే వాళ్లను హాస్పిటల్‌కు తీసుకెళ్తాం అక్కడ వైద్యులకు చూయించి బిడ్డకు జనమ్మనిచ్చేలా చికిత్స తీసుకుంటాం. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం పురిటినొప్పులు వచ్చిన తన ప్రియురాలికి యూట్యూబ్‌లో చూసి ప్రసవం చేశాడు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Tamil Nadu: యూట్యూబ్ వీడియో చూస్తూ యువతికి ప్రసవం.. హాస్పిటల్‌కు వెళ్లగా...
Tamilnadu Incident

Updated on: May 08, 2025 | 1:22 PM

ప్రస్తుత ఆధునిక యుగంలో, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన ఫోన్లలో వివిధ విషయాలను చూసి నేర్చుకునే స్థాయికి టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు నేరాలకు కూడా పాల్పడుతున్నారు. ఇలానే యూట్యూబ్‌లో సినిమాలు చూసి హత్యలకు పాల్పడిన ఘటను కూడా మనం చాలానే చూశాం. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఓ సంఘటనే వెలుగు చూసింది. పురిటినొప్పులతో బాధపడుతున్న తన ప్రియురాలని హాస్పిటల్‌లకు తీసుకెళ్లకుండా.. యూట్యూబ్‌లో చూసి ఆ యువతికి ఇంట్లోనే ప్రసవం చేశాడు ప్రియుడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌ జిల్లాలోని అవినాశి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన తల్లితో కలిసి గోపిచెట్టిపాళయంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో చదువుతున్న 19 ఏళ్ల యువతితో ఆతని పరిచయం ఏర్పడింది. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరు..రాను రాను ప్రేమకులుగా మారారు. ఇక ఇద్దరూ కొన్నాళ్ల పాటు ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమించుకున్నారు.

ఇక వీళ్లకు తరచూ కలుసుకోవడం ఇబ్బందిగా మారడంతో తమకు పెళ్లైందని..ఇద్దరూ భార్యభర్తలమని చెప్పి ఓ ఇంటిని అద్దెకు తీసకున్నారు. ఇక పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ భార్యభర్తలుగా కలిసి జీవించినట్టు తెలుస్తోంది. ఇంతలో ఆ యువతి గర్భవతి అయింది. అయితే యువతి అతడితో కలిసి నివసిస్తున్న విషయం ఆమె ఇంట్లో వాళ్లకు తెలియదు. దీంతో గర్బవతిగా ఉన్న యువతి బయటకు రాలేని పరిస్థితి.

అయితే ఒకరోజు సడన్‌గా ఆ యువతికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో బయటకు తీసుకెళ్తే అందరికీ తెలుస్తుందని అనుకున్నాడో ఏమోగాని.. ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా.. ఇంట్లోనే యూట్యూబ్‌లో చూసి ఆ యువతికి ప్రసవం చేశాడు  ఆ యువకుడు. ఇక ఆ యువతి ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. అయితే ప్రసవం తర్వాత ఆ యువతికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అది ఎంతకీ తగ్గక పోవడంతో చికిత్స నిమిత్తం మరుసటి రోజు ఆమెను కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఆ యువకుడు.

హాస్పిటల్‌లో ఆ యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు గుర్తించారు. అయితే బిడ్డ లేకుండా తల్లిని మాత్రమే హాస్పిటల్‌కు తీసకురావడంతో అనుమానం వచ్చిన నర్సులు ఈ విషయంపై యువకుడిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఇక అతని వెంబడే ఇంటికి వెళ్లి పరిశీలించారు వైద్యులు. ఇంట్లో ఉన్న యువకుడి తల్లి ఆ బిడ్డను చూసుకుంటున్నట్టు గుర్తించారు. పక్కనే ఓ కవర్లో చిన్నారి బొడ్డుతాడును గుర్తించిన వైద్యులు.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఆ తర్వాత ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..