‘అడల్ట్’ వాట్సాప్ గ్రూప్‌లో.. సినీ నటి ఫోన్ నెంబర్

శృంగార వీడియోలు షేర్ చేసే వాట్సాప్ గ్రూప్‌లో ఓ సినీనటి ఫోన్ నెంబర్ చేరింది. దీంతో.. ఆమెకు విపరీంతంగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో.. ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను..

అడల్ట్ వాట్సాప్ గ్రూప్‌లో.. సినీ నటి ఫోన్ నెంబర్

Edited By:

Updated on: Feb 28, 2020 | 11:19 AM

శృంగార వీడియోలు షేర్ చేసే వాట్సాప్ గ్రూప్‌లో ఓ సినీనటి ఫోన్ నెంబర్ చేరింది. దీంతో.. ఆమెకు విపరీంతంగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రూపంలో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో.. ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ‘అడల్ట్ వాట్సాప్ గ్రూప్‌లో ఫోన్ నెంబర్ షేర్ చేసిన వ్యక్తిని’ పట్టుకున్నారు. ఇంతకీ ఆ నెంబర్ షేర్ చేసిన వ్యక్తి పిజ్జా బాయ్ అని తేలింది. అలాగే ఆ పిజ్జా కంపెనీకి కూడా ఫిర్యాదు చేశారు.

‘డోమినోస్ పిజ్జా డెలివరీ బాయ్ ఫిబ్రవరి 9న చెన్నైలోని మా ఇంటికి పిజ్జా డెలివరీ చేశాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడు. నా ఫోన్ నెంబర్‌ను అడల్ట్ వాట్సాప్ గ్రూప్‌లో చేశాడు. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. కానీ ఇంతవరకూ మీ నుంచి ఎవరూ నాతో మాట్లాడలేదు. నాకు మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఆ బాధ తట్టుకోలేకపోతున్నానని ఫిబ్రవరి 26న ట్వీట్ చేసింది నటి. దీంతో స్పందించిన పోలీసు శాఖ.. ఆ బాయ్‌పై చర్యలు తీసుకుంది. ఇంతకీ ఈ నటి ఎవరంటే.. 1990ల్లో బేబీ శ్యామిలీ నటించిన ‘అంజలి’ సినిమాలోని బాలనటిగా యాక్ట్ చేశారు. ఆమె పేరు గాయత్రీ సాయి.