సికింద్రాబాద్‌లో విషాదం..విద్యార్థిని అనుమానాస్పద మృతి

సికింద్రాబాద్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానిక రైల్వే కళాశాలలో ఇంటర్‌ సెంకడ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఒక్కరోజు ముందే కనిపించకుండా పోయింది. మర్నాడు ఉదయం ఇంటి సమీపంలోనే శవమై తేలింది.

సికింద్రాబాద్‌లో విషాదం..విద్యార్థిని అనుమానాస్పద మృతి

Updated on: May 30, 2020 | 3:36 PM

సికింద్రాబాద్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న గట్టు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కుటుంబంతో చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. కొంతమేర శిథిలమైన మూడు అంతస్థుల బిల్డింగ్‌లో లక్ష్మీనారాయణ కుటుంబం మాత్రమే ఉంటోంది. అతని కుమార్తె స్థానిక రైల్వే కళాశాలలో ఇంటర్‌ సెంకడ్ ఇయర్ చదువుతోంది. అయితే, కొంతకాలంగా ఆ అమ్మాయి ఎవరితోనో ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతోందని, ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీ(గురువారం) సాయంత్రం 5.30 గంటల నుంచి కనిపించకుండా పోయిందని..లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 29న(శుక్రవారం)ఉదయం 7.30 గంటలకు లక్ష్మీనారాయణ ఉంటున్న భవనం సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మ‌ృతదేహన్ని పరిశీలించగా..మృతురాలు మిస్సింగ్ కసు నమోదైన రైల్వే ఉద్యోగి లక్ష్మి నారాయణ కూతురుగా గుర్తించారు. వారు ఉంటున్న భవనం టెర్రస్‌ పైన పిట్టగోడ కేవలం మూడు అడుగులు మాత్రమే ఉండటంతో.. ఫోన్‌ మాట్లాడుతూ ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయినప్పటికీ మృతురాలిది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా..? లేదంటే. మరేదైన మిస్టరీ దాగివుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.