Crime News: నెల్లూరులో డెంటల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. విచారణలో వెలుగులోకి సంచలనాలు!

నెల్లూరులో అర్థరాత్రి వైద్య విద్యార్థి మృతి కలకలం రేపింది. నారాయణ డెంటల్ కాలేజీలో మెడికో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది.

Crime News: నెల్లూరులో డెంటల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. విచారణలో వెలుగులోకి సంచలనాలు!
Suicide

Updated on: Nov 01, 2021 | 11:09 AM

Dental Student Suicide: నెల్లూరులో అర్థరాత్రి వైద్య విద్యార్థి మృతి కలకలం రేపింది. నారాయణ డెంటల్ కాలేజీలో మెడికో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. హాస్టల్‌ రూమ్‌లో డెంటల్ విద్యార్ధిని లాలస ఉరేసుకుని కనిపించింది. ఇద గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలానికి పోలీసులు చేరుకునేలోపే ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన లాలస.. నెల్లూరులోని నారాయణ కాలేజీలో డెంటల్‌ చదువుతోంది. ఏమైందో ఏమో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తాను ఉంటోన్న హాస్టల్‌ రూమ్‌లోనే ఫ్యాన్‌కి ఉరేసుకుంది. అయితే, లాలస మృతిపై పేరెంట్స్‌ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటే తెల్లవారేవరకు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంపై పౌరహక్కుల నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కావాలనే ఆలస్యంగా బయటపెట్టారని ఆరోపిస్తున్నారు. కాగా, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Read Also….  Sandwich In Bullet: బుల్లెట్టు బండి మీద హాట్‌కేకుల్లా శాండ్‌విచ్ అమ్ముతున్న వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో…