Suspected Death: నిర్మల్ జిల్లాలో విషాదం.. సింగన్‌గావ్ చెరువులో శవాలై తేలిన ముగ్గురు అక్కా-చెల్లెల్లు

నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. తానూర్ మండలం సింగన్‌గావ్ గ్రామంలో విషాద ఘటన జరగింది.

Suspected Death: నిర్మల్ జిల్లాలో విషాదం.. సింగన్‌గావ్ చెరువులో శవాలై తేలిన ముగ్గురు అక్కా-చెల్లెల్లు
Suspected Death In Nirmal

Updated on: Jul 05, 2021 | 8:48 AM

Three Girls Suspected Death: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. తానూర్ మండలం సింగన్‌గావ్ గ్రామంలో విషాద ఘటన జరగింది. ముగ్గురు అక్కా చెల్లెల్లు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం అదృశ్యం అయిన ముగ్గురు యువతులు.. ఇంటికి రాకపోవడంతో సమీప బందువులను‌ ఆరా తీశారు కుటుంబ సభ్యులు. ఈ ఉదయం గ్రామ చెరువులో ముగ్గురు విగత జీవులై కనిపించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదమా హత్యా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన వారిని సునీత (16 ), వైశాలీ ( 14 ), అంజలి (14)గా గుర్తించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also…  Telangana Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తారు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ