అసోంలో బంగ్లాదేశీ పశువుల దొంగ.. కొట్టి చంపిన స్థానికులు.. రీజన్ ఇదే..

| Edited By:

Jun 03, 2020 | 10:30 PM

అసోంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ దొంగను స్థానికులు కొట్టి చంపారు. కరీంగంజ్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

అసోంలో బంగ్లాదేశీ పశువుల దొంగ.. కొట్టి చంపిన స్థానికులు.. రీజన్ ఇదే..
Follow us on

అసోంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ దొంగను స్థానికులు కొట్టి చంపారు. కరీంగంజ్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బంగ్లదేశ్‌కు చెందిన వ్యక్తిగా తెలిపారు. అతడు అసోంలోని కరీంగంజ్ ప్రాంతంలో అక్రమంగా పశువుల్ని తరలించే వాడని.. గుర్తించారు. మే1వ తేదీన.. ముగ్గురు వ్యక్తులు సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడ్డారని.. అక్కడి నుంచి స్థానిక చంపాబరి ప్రాంతంలోని పుతిన్ టీ గార్డెన్‌లో ఉంటూ.. అక్రమంలో పశువుల్ని తరలిస్తున్నారని తెలిపారు. అయితే వీరు మంగళవారం నాడు.. అక్రమంలో పశువుల్ని దొంగిలించడాన్ని చూసిన స్థానిక మహిళ ఒకరు అరవడంతో వారిని పట్టుకుని చితకబాదారని.. ఈ క్రమంలో దుండగుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.