Sushant Singh Rajput’s Relatives Killed In Accident: బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురు బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ విషాద సంఘటన బీహార్‌లోని జుమైలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ట్రక్కు, కారు ఢీకొనగా.. కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారందరినీ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హల్సీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సికంద్రా-షేక్‌పూర్ ప్రధాన రహదారిపై పిప్రా గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని.. సమాచారం మేరకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. జుమైలోని ఖైరా బ్లాక్‌లోని నౌదిహాకు చెందిన సుశాంత్ సింగ్ బంధువులు.. ఓ వ్యక్తి దహన సంస్కారాల కోసం పాట్నా వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కారును ట్రక్కు బలంగా ఢీకొట్టింది.
ప్రాణాలు కోల్పోయిన లాల్జీత్ సింగ్ సుశాంత్ సింగ్‌కు దగ్గరి బంధువని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: