గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్

|

Nov 24, 2021 | 2:44 PM

డెయిలీ తాగే చాయ్‌లో విచ్చలవిడిగా సింథటిక్ కెమికల్స్‌ కలుపుతున్నారు. ఈ అడ్డగోలు దందా రీసెంట్‌గా బయటపడింది. కానీ మార్కెట్‌ను ఎప్పుడో ముంచెత్తింది.

గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్
Adulteration Of Tea
Follow us on

కల్తీ మాల్‌ కంగారెత్తిస్తోంది. గుటక గుటకలో గరళం.. ఇంతకాలం మనం తాగింది ఇదేనా అన్న సందేహం ఒంట్లో వణుకు పుట్టిస్తోంది. డెయిలీ తాగే చాయ్‌లో విచ్చలవిడిగా సింథటిక్ కెమికల్స్‌ కలుపుతున్నారు. ఈ అడ్డగోలు దందా రీసెంట్‌గా బయటపడింది. కానీ మార్కెట్‌ను ఎప్పుడో ముంచెత్తింది. అంటే..ఇప్పటికే మన ఆరోగ్యానికి ఈ కల్తీ మాల్‌ ఎసరు పెట్టేసిందా? ఈ ఆందోళనే ఇప్పుడు దడ పుట్టిస్తోంది.

నోరూరించే సువాసన.. ఒక్క సిప్ అయిన టేస్ట్ చేయాలనిపించే రంగు.. కంటికి ఇంపుగా కనిపించే చిక్కదనం..  ఇవన్నీ చూసి టెంప్ట్‌ అయి ఛాయ్ చటుక్కున తాగేస్తున్నాం మనం. కానీ ఒక్కసారి మన కిచెన్‌లోకి వెళ్లి.. మనం తాగే టీ పౌడర్‌ నకిలీదా..? ఒరిజనలా? అని చెక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 46 క్వింటాళ్ల నకిలీ టీ పొడిని పోలీసులు సీజ్ చేశారు. ఇందులో ప్రమాదకరమైన రసాయనాలు, ఇనుప రజ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో టీ పౌడర్‌ మార్కెట్‌లోకి వస్తే.. ఒక కప్పు చాయ్‌కి గ్రాము టీ పొడి వాడినా.. ఎన్ని లక్షల మంది తాగి ఉంటారో ఊహించుకోండి. అంటే.. వాళ్ల హెల్త్‌ అంతా మటాషేనా? హైదరాబాద్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన కల్తీగాళ్లు.. చాలాకాలంగా ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

మద్యం తాగనివాళ్లు ఉంటారేమో కానీ టీ తాగని వాళ్లు మాత్రం ఉండరు. టీలో మత్తు గమ్మత్తే వేరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫేక్ టీ పౌడర్ చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. కలర్‌ఫుల్‌గా కనిపించే గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు ఆందోళన కలిగిస్తోంది. తెలుగురాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకుని కల్తీగాళ్లు యథేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నారు. ఆరోగ్యాన్ని కల్తీ చేసే నకిలీ టీ పౌడర్ మార్కెట్‌లో డెడ్‌చీప్‌గా దొరుకుతుంది. ధర తక్కువ రుచి ఎక్కువ అని కమిట్ అయితే అంతే సంగతులు.

ఫేక్ మాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. తక్కువ ధరలకు మొగ్గు చూపకుండా నాణ్యమైన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫేక్ పదార్థాలపై అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలంటున్నారు.

Also Read:  టమాటా రేటు పెరిగింది.. పంట పండింది.. కుబేరుడైన కర్నూలు జిల్లా రైతు