షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్‌ సూసైడ్

|

Jun 17, 2020 | 11:19 AM

షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ (జూన్ 17 )బుధవారం ఉదయం గాంధీనగర్‌లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లారు. చెల్లెలు ఇంటి నుంచి తిరిగివెళ్తూ అదే భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం 40కోట్ల ల్యాండ్ డీలింగ్ విషయంలో లంచాలు తీసుకున్నట్లు తహసీల్దార్‌ సుజాత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు […]

షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్‌ సూసైడ్
Follow us on

షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ (జూన్ 17 )బుధవారం ఉదయం గాంధీనగర్‌లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లారు. చెల్లెలు ఇంటి నుంచి తిరిగివెళ్తూ అదే భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

కొద్దిరోజుల క్రితం 40కోట్ల ల్యాండ్ డీలింగ్ విషయంలో లంచాలు తీసుకున్నట్లు తహసీల్దార్‌ సుజాత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయమై ఏసీబీకి పట్టుబడ్డారామె. ప్రస్తుతం ఆమె ఏసీబీ రిమాండ్‌లో ఉండగానే.. ఆమె భర్త అజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు అజయ్‌ను కూడా విచారించారు. కానీ, ఏమైందో ఏమో.. ఈ రోజు సోదరి ఇంటికి వెళ్లిన అజయ్‌.. ఆ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి చనిపోయారు.