ఆఫ్ఘాన్ దళాలపై సూసైడ్ బాంబర్ దాడి.. ముగ్గురు మృతి

| Edited By:

Apr 30, 2020 | 12:36 PM

కాబూల్‌లో ఆఫ్ఘాన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కి చెందిన స్థావరంపై ఓ సూసైడర్ బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడికి పాల్పడింది తాలిబన్లేనని..

ఆఫ్ఘాన్  దళాలపై సూసైడ్ బాంబర్ దాడి.. ముగ్గురు మృతి
Follow us on

కాబూల్‌లో ఆఫ్ఘాన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కి చెందిన స్థావరంపై ఓ సూసైడర్ బాంబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. కాగా ఈ దాడికి పాల్పడింది తాలిబన్లేనని ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆఫ్ఘాన్ దక్షిణ మంత్రి, యూఎస్ దళాల కమాండర్ జనరల్ అసదుల్లా ఖాలీద్ ఈ బేస్‌ని సందర్శించి వెళ్లిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ఆర్మీ కమాండోల బేస్ బయట కొందరు కాంట్రాక్టర్లు వేచి ఉండగా, ఆత్మాహుతి దళాల సభ్యుడు తనను తాను పేల్చి వేసుకున్నాడు. కాగా తాలిబన్లే ఈ దాడికి పడినట్లు హోంశాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వెల్లడించారు. సూసైడ్ బాంబర్ ఆఫ్గన్ దళాల బేస్‌ను టార్గెట్ చేసుకున్నాడని అయితే అది విఫలం కావడంతో అమాయక పౌరులను పొట్టన బెట్టుకున్నాడని ఆయన వెల్లడించారు.

Read More: 

వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

గుడ్‌న్యూస్: వడ్డీ లేకుండా అప్పు.. కానీ షరతులు వర్తిస్తాయి!

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు