Tortoise Rocket: తాబేళ్లు దగ్గరుంటే అదృష్టం వరిస్తుందా..? స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టుతో వెలుగులోకి వస్తున్న నిజాలు..!

|

Jul 31, 2021 | 6:25 PM

మన దేశంలో మూఢనమ్మకాలే కొందరికి కాసులు కురిపిస్తాయి. ముఖ్యంగా అదృష్టం అనే పేరు చెబితే చాలు కొందరు భారీగా ఖర్చు చేసి మరీ ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు.

Tortoise Rocket: తాబేళ్లు దగ్గరుంటే అదృష్టం వరిస్తుందా..? స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టుతో వెలుగులోకి వస్తున్న నిజాలు..!
Tortoise Smuggling Racket
Follow us on

Tortoise Smuggling Racket Busted: మన దేశంలో మూఢనమ్మకాలే కొందరికి కాసులు కురిపిస్తాయి. ముఖ్యంగా అదృష్టం అనే పేరు చెబితే చాలు కొందరు భారీగా ఖర్చు చేసి మరీ ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాబేళ్లపై కొందరకి కోట్లు కుమ్మరిస్తున్నారు. దీంతో అరుదైన జీవులు స్మగ్లర్ల పాలిట కల్పవృక్షాల్లా మారుతున్నాయి. ఇదే క్రమంలో నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణా కొనసాగుతోంది. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా తాబేళ్ల మాఫియా రెచ్చిపోతోంది. దొంగచాటుగా అరుదైన తాబేళ్లను ఇతర రాష్ట్రాలకు దేశాలకు తరలిస్తున్నారు. తాబేళ్లను దళారులు అక్రమంగా రవాణా చేసి లక్షలాది రూపాయలను వెనుకేసుకుంటున్నారు. సాధారణంగా దేవాలయాలు, అడవుల్లోనూ ఉండాల్సిన నక్షత్ర తాబేళ్లు రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తున్నాయి. అక్కడినుంచి పొరుగు విదేశాలకు స్మగ్లింగ్ చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్ మహానగరంలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు, పోలీసుల సాయంతో పట్టుకున్నారు. రామంతపూర్‌లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో అసలు వ్యవహారం వెలుగులోకివచ్చింది. వీరి నుంచి 330 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ ఒకటి ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. తాబేళ్లు పట్టుకోవటం, తరలించటం, అమ్మటం నేరు. ఇండియన్ టెంట్ లేదా అస్సాం రూఫుడ్ టార్టయిస్ గా పిలిచే ఈ తాబేళ్లు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ప్రాంతానికి చెందిన శివ బాలక్, రాహుల్ కాశ్యప్ లను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నారు. లక్నో సమీపంలో గోమతి నదిలో వీటిని పట్టుకుని రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో వీరిద్దరు ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వీరిపై నిఘా పెట్టిన విజిలెన్స్ టీమ్.. పక్కా ఫ్లాన్‌తో కొనుగోలుదారులుగా వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇద్దరినీ మేడ్చల్ జిల్లా ఉప్పల్ రేంజ్ అధికారికి అప్పజెప్పారు. కాగా, ఇద్దరిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే, ఉత్తర ప్రదేశ్ నుంచి రైలు ద్వారా ఇలా తాబేళ్లను తరలిస్తూ హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు సమాచారం. నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయాలకు వీటిని విక్రయిస్తున్నారు. పెట్ షాపులు, అక్వేరియం షాపుల నిర్వాహకులు వీటిని కొనుగోలు తెలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. తాబేళ్లను కొనటం, అమ్మటం కూడా కూడా నిషేధమని, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ షాపుల నిర్వాహకులను అటవీశాఖ హెచ్చరించింది. అలాగే తాబేళ్లను ఇళ్లలో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసివస్తుందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.

Read Also… 

Viral Video: ఫుట్‌పాత్‌పై నడుస్తున్న వ్యక్తి.. అంతలోనే భారీ పేలుడు.. షాకింగ్ దృశ్యాలు.!