విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేందుకు వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు కొందరు మోసగాళ్లు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో పనిచేస్తున్న ఓ మహిళ శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు ప్రయత్నించింది. అయితే అనుమానమొచ్చిన మహిళా సిబ్బంది తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. మహిళ నుంచి సుమారు 2.4 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ), ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
షార్జా నుంచి వచ్చే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో బంగారం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న అధికారులు విమానం కోజికోడ్‌లో ల్యాండ్ అవ్వగానే తనిఖీలు ప్రారంభించారు. ఈక్రమంలోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్న షహానా అనే మహిళ తన శానిటరీ ప్యాడ్స్‌లో బంగారం దాచి తీసుకువచ్చిందని మహిళా అధికారులు గుర్తించారు. నిందితురాలిది కేరళలోని మలప్పురం ప్రాంతమని అధికారులు తెలిపారు.
Also Read:
Accident: బట్టల షాపులోకి దూసుకెళ్లిన బైక్.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు.. అసలు ఏం జరిగిందంటే..