Family Died: వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసి ఆ కుటుంబం నిద్రలోకి జారుకుంది. ఈ క్రమంలో జనరేటర్ బంద్ చేయకపోవడంతో.. పేలిపోయి.. ఆ ఇల్లు మొత్తం దట్టమైన పొగ (కార్బన్ డై ఆక్సైడ్) వ్యాపించింది. దీంతో ఊపిరాడక కుటుంబంలోని అందరూ ప్రాణాలు కోల్పోయారు. చిన్న పొరపాటు కారణంగా ఒకే ఇంట్లో ఆరుగురు చనిపోయిన సంఘటన మహారాష్ర్టలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రాపూర్ జిల్లాలోని దుర్గాపూర్‌లో సోవవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దుర్గాపూర్‌లో సోమవారం రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రమేశ్ లష్కర్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసి నిద్ర పోయాడు. ఈ క్రమంలో అది పేలి దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం ఆ ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా.. రమేశ్ కుటుంబంలోని ఏడుగురు గాయాలతో స్పహ లేకుండా కనిపించారు. ఇల్లు తెరిచిన సమయంలో ఇంటి నిండా విష వాయువు దట్టంగా అలుముకుని ఉందని స్థానికులు పేర్కొన్నారు. వారిని ఇంటినుంచి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయని ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Maharashtra | Six members of a family died in a generator blast at Durgapur in Chandrapur last night, police investigation on
— ANI (@ANI) July 13, 2021
జనరేటర్ నుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కావడంతో.. అందరూ ఊపిరాడక మృతి మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: