Cheating: రాగి చెంబుకు పూత పూసి పంగనామం.. కొంప కొల్లేరు

|

Oct 23, 2021 | 7:53 AM

ఇరీడియం..వెరీ కాస్ట్‌లీ మెటల్‌. గోల్డ్‌, ప్లాటినం కంటే దీని ధర ఎక్కువే. అందుకే కేటుగాళ్లు ఈ బిజినెస్‌పై నజర్‌ పెట్టారు. ఇరీడియం పేరుతో పలువురిని బురిడీ కొట్టించిన గ్యాంగ్‌ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

Cheating: రాగి చెంబుకు పూత పూసి పంగనామం.. కొంప కొల్లేరు
Iridium Cheating
Follow us on

ఇదో కొత్త రకం మోసం. తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన ఓ గ్యాంగ్‌ అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం బిజినెస్‌ చేస్తున్నామంటూ పలువురిని నమ్మించారు. ఈ క్రమంలో ఇరీడియం మెటల్‌ ఉందని 1500 కూడా ఖరీదు చేయని ఓ రాగి చెంబుని కోట్లలో అమ్మకానికి పెట్టింది ముఠా. ఈ ఆఫర్‌ నచ్చిన కేరళకి చెందిన మహారూప్‌, అబ్దుల్‌ అనే వ్యక్తులు రాగిచెంబును కొనేందుకు కోయంబత్తూర్‌ గ్యాంగ్‌తో డీల్‌ కుదుర్చుకున్నారు. కేరళ వ్యాపారులకు ఏమాత్రం అనుమానం రాకుండా రాగిచెంబును..ఇరీడియం మెటల్‌తో పైపూత చేయించారు. డీల్‌ కొనుగోలు చేసే సమయంలో రాగిచెంబును నిపుణులతో పరిశీలించాక..ఇరిడీయం కొనుగోలుకు కేరళ వ్యాపారులు మహారూప్‌, అబ్దుల్‌ 30 లక్షల రూపాయలు అడ్వాన్స్‌ ఇచ్చారు. అనుకున్న ప్రకారం కోయంబత్తూరు గ్యాంగ్‌ రాగి చెంబును అందించారు.

ఐతే తాము కొనుగోలు చేసింది ఇరిడియం కాదని..అది కేవలం రాగిచెంబు అని తేలింది. దాంతో బాధితులు మహారూప్‌, అబ్దుల్‌ ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు..కోయంబత్తూరుకు చెందిన దినేష్‌కుమార్‌ను గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కోటికి పైగా ఉన్న దొంగనోట్లు, ఇరిడీయం అని నమ్మించే పలు పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ యేడాది ఇరిడియం మెటల్‌ ధర 131 శాతం పెరిగింది. ఒక గ్రాము ఇరిడియం ధర 15వేల పైనే పలుకుతోంది. అంటే బంగారం, ప్లాటినం ధరకన్నా ఎక్కువే. ఇరిడియాన్ని ఎక్కువగా విమానం ఇంజన్లు, నీటిలోపల వేసే పైపుల తయారీకి వాడతారు. ఈ మెటల్‌ పెద్దగా తుప్పు పట్టకపోవడంతో..ఎంత వేడినైనా తట్టుకుంటుంది. అత్యంత అరుదుగా ఇరిడియం దొరుకుతుండటంతో దీనికి మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని పోలీసులు చెప్పారు.

Also Read: Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..