Gulab Cyclone: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. సముద్రంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతు.. ముగ్గురు క్షేమంగా.. 

|

Sep 26, 2021 | 7:55 PM

Gulab Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను తీర ప్రాంతాల్లో ఆందోళనకు గురిచేస్తోంది. తుపాన్‌ ముప్పు ఉన్నందున తీర ప్రాంతాల్లోని ప్రజలు

Gulab Cyclone: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. సముద్రంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతు.. ముగ్గురు క్షేమంగా.. 
Drowned
Follow us on

Gulab Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను తీర ప్రాంతాల్లో ఆందోళనకు గురిచేస్తోంది. తుపాన్‌ ముప్పు ఉన్నందున తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది. ఈ తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంద్ర జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లొద్దంటూ సూచించారు. అయితే.. గులాబ్ తుఫాన్ ఈ రోజు అర్థరాత్రి టెక్కలి, పలాస నియోజకవర్గాల మద్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతోపాటు ప్రభుత్వం తీర ప్రాంతాల్లో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, ఎనిమిది ఎస్టీఆర్ఎఫ్ బృందాలను, అధికారులు, సిబ్బందిని మోహరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేసి తీసుకుంటన్న చర్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మత్స్యకారులు క్షేమంగా తీరం చేరారు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఒడిషాలో బోటు కొనుక్కుని సముద్ర మార్గంలో తిరిగి వస్తుండగా.. బారువ సమీపంలో అలల తాకిడికి బోటు తిరగబడినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కాగా.. మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు పేర్కొంటున్నారు. తీరం చేరిన ముగ్గురు మత్స్యకారుల్లో వంకా చిరంజీవులు, కొండా భీమారావు, తెలకల పాపారావు ఉన్నారు. వీరంతా అక్కుపల్లి బీచ్ కు చేరుకున్నారు. స్వల్ప గాయాలతో ఉన్న వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వంక నాయుడు, మరి ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో మంచినీళ్లపేట గ్రామంలో విషాదం నెలకొంది.

Also Read:

Gulab Cyclone Live Updates: గులాబ్ సైక్లోన్ లైవ్ అప్డేట్స్ : ఉత్తరాంధ్రా – దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకిన గులాబ్ తుఫాన్

Perni Nani: ఏపీలోనే నిర్మాతలకు ఎక్కువ షేర్‌.. జనసేన అధినేత పవన్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్..