Ghazipur Road Accident: రోడ్డు పక్కనున్న హోటల్ దగ్గర ఉదయాన్నే టీ తాగుతున్నారు. ఈ క్రమంలో మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. వేగంగా వస్తున్న ట్రక్కు రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మత్యువాతపడ్డారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు మహ్మదాబాద్ కొత్వాలీ పరిధిలోని అహిరోలి గ్రామంలోని టీ స్టాల్‌లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడినట్లు మహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ ఆర్‌బీ సింగ్ తెలిపారు. డ్రైవర్‌ను రక్షించేందుకు పోలీసులు బాగా శ్రమించాల్సి వచ్చింది. అహిరోలి శివారులోని ఓ టీస్టాల్ వద్ద జనం కూర్చొని ఉండగా.. భరౌలీ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు టీ స్టాల్‌లోకి చొచ్చుకెళ్లిందన్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారన్నారు. నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Ghazipur: A truck rammed into a tea stall along Ghazipur-Ballia road at Ahirauli village in Bhawarkol area, killing 6 people & injuring 4 others today morning, says DM SP Singh
After the accident, locals blocked the road which was later cleared by higher officials pic.twitter.com/vf80dmtgKV
— ANI UP (@ANINewsUP) November 2, 2021
Also Read: