Andhra Pradesh: అత్తను తలపై బలంగా మోది.. పుట్టింటికి పారిపోయిన కోడలు.. సీన్ కట్ చేస్తే.. జరిగిన కథ ఇది.!

| Edited By: Narender Vaitla

Mar 14, 2024 | 10:09 PM

Andhra Pradesh: తొలుత ఫిర్యాదు ఇవ్వకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో ఆరా తీశారు. కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేశారు. కొడుకును విచారించేసరికి.. కోడలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కోడలు కొట్టి చంపినట్టు నిర్ధారించుకుని ఆమెపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు. సింహాద్రమ్మ మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురికి తరలించారు. పూర్ణను అరెస్ట్ చేసామన్నారు సిఐ శంకర్రావు.

Andhra Pradesh: అత్తను తలపై బలంగా మోది.. పుట్టింటికి పారిపోయిన కోడలు.. సీన్ కట్ చేస్తే.. జరిగిన కథ ఇది.!
Ap News
Follow us on

Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో దారుణం. కొడుకునిచ్చి పెళ్లి చేసిన అత్త పట్ల కోడలు కర్కాశంగా వ్యవహరించింది. రోకలితో మోది కసి తీర్చుకుంది కోడలు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలకు కోల్పోయింది అత్త. అత్త గాయపడి కొన ఊపిరితో ఉన్నా పట్టించుకోకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కొత్తూరు పంచాయతీ దేవినగర్. సింహాద్రమ్మ.. తనకు ఓ కొడుకు, కోడలు. 2007 లో కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో అత్త కోడల మధ్య పొసగ లేదు. దీంతో వేరే కాపురం పెట్టారు. అయినా పక్కపక్కనే నివాసం. ఎప్పుడూ ఇద్దరి మధ్య వివాదం జరుగుతూనే ఉంటుంది. చీటికిమాటికి అత్తపై కోడలు కోపగించుకుంటూనే ఉంటుంది. ఏమైందో ఏమో కానీ ఈ ఉదయం కొడుకు డ్యూటీ కి వెళ్ళిపోయాడు. మళ్లీ అత్త సింహాద్రి అమ్మ కోడలు పూర్ణ మధ్య వివాదం మొదలైంది. ఇంతలో అత్తను రోకలితో తలపై మోదింది కోడలు పూర్ణ. ముఖం తలపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న అతను పట్టించుకోకుండా.. భర్తకు చెప్పి పుట్టింటికి పారిపోయింది కోడలు పూర్ణ. హుటాహుటిన ఇంటికి వచ్చిన కొడుకు.. తీవ్ర గాయాలతో కొనఊపిరితో ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు దృవీకరించారు.

అయితే.. తొలుత ఫిర్యాదు ఇవ్వకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో ఆరా తీశారు. కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేశారు. కొడుకును విచారించేసరికి.. కోడలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కోడలు కొట్టి చంపినట్టు నిర్ధారించుకుని ఆమెపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు. సింహాద్రమ్మ మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురికి తరలించారు. పూర్ణను అరెస్ట్ చేసామన్నారు సిఐ శంకర్రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..