ఆమె నడవడికే కాదు.. ప్రవర్తన కూడా డేంజరే.. ఆస్తి కోసం సొంత బావను చంపేందుకు కంత్రీ మరదలు సుపారీ..!

అనంతపురం జిల్లా పోలేవాండ్లపల్లిలో జరిగిన హత్యాయత్నం కేసులో జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసింది అతని మరదలేనని పోలీసులు తేల్చారు.

ఆమె నడవడికే కాదు.. ప్రవర్తన కూడా డేంజరే.. ఆస్తి కోసం సొంత బావను చంపేందుకు కంత్రీ మరదలు సుపారీ..!
Ananthapur Killing Gang

Updated on: Jul 20, 2021 | 1:11 PM

Gave Money for killing a Man: ఆమె నడవడికే కాదు.. ప్రవర్తన కూడా డేంజరేనని చాటుకుంది. అనంతపురం జిల్లా పోలేవాండ్లపల్లిలో ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసులో జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసింది అతని మరదలేనని పోలీసులు తేల్చారు. నిందితులకు సుపారీ ఇచ్చి హత్య చేయాలని మాట్లాడుకున్నట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఎక్కడ ఆస్తి పోతుందోనన్న కక్షతో తన బావను హత్య చేసేందుకు స్కెచ్‌ వేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతపురం హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

భాగ్యలక్ష్మికి పెళ్లి అయినప్పటి నుంచి తన ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఉన్న డబ్బులతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో తన బావ జగన్మోహన్‌రెడ్డికి కూడా పెళ్లి కాలేదు. ఆయన మ్యారేజ్‌ ప్రపోజల్‌లో ఉండగా.. ఎక్కడ ఆస్తి తనకు రాకుండా పోతుందోనని అనుకున్న భాగ్యలక్ష్మి.. అతన్ని అంతమోదించాలనుకుంది. ఏకంగా కిరాయి హంతకులతో మర్డర్‌కు ప్లాన్‌ వేసింది. తనకు పరిచయం అయిన మహ్మద్‌ అతిక్‌, జిలానీ, విక్టర్‌ డేవిడ్‌లకు ఆ పని అప్పగించింది. ఇందుకు కొంత సొమ్ము చెల్లించి ఒప్పందం కుదుర్చుకుందని పోలీసులు తెలిపారు.

ఇందులో భాగంగా ఈనెల 7న తన బావ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి రమ్మని చెప్పిన భాగ్యలక్ష్మి.. మర్డర్‌ ప్లాన్‌ను అమలు చేసేందుకు యత్నించింది. కానీ, బాదితుడు తేరుకుని కేకలు వేయడంతో.. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. మొదటి నుంచి భాగ్యలక్ష్మి తీరు అనుమానంగా ఉండడంతో పోలీసులు కూడా అదే కోణంలో విచారించగా, కంత్రీ మరదలు ఉదంతం వెలుగుచూసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి భాగ్యలక్ష్మీతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Read Also… Andhra Pradesh: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం.. అక్కడ బోటు కనిపించడంతో..

Viral Video :ఒకదానికొకటి పెనవేసుకొని కుప్ప కుప్పగా… బుసలు కొడుతున్న కోడెనాగులు.. వీడియో వైరల్..