GUN FIRE: అమెరికాలో కాల్పుల కలకలం.. ప్రమాదంలో ముగ్గురు మృతి.. మరికొందరికి గాయాలు..

అమెరికాలో తుపాకి తూటాలు మ‌ళ్లీ విరుచుకుపడ్డాయి. ఇలినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న క్రీడా మైదానంలో ఓ వ్యక్తి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జ‌రిపాడు.

GUN FIRE: అమెరికాలో కాల్పుల కలకలం.. ప్రమాదంలో ముగ్గురు మృతి.. మరికొందరికి గాయాలు..

Edited By:

Updated on: Dec 27, 2020 | 2:10 PM

అమెరికాలో తుపాకి తూటాలు మ‌ళ్లీ విరుచుకుపడ్డాయి. ఇలినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న క్రీడా మైదానంలో ఓ వ్యక్తి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జ‌రిపాడు. దీంతో ముగ్గురు మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్లడించారు. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు రాక్‌ఫోర్డ్ పోలీస్ చీఫ్ డాన్ ఓషియా తెలపారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి గురించి కానీ, బాధితుల గురించి కానీ ఇత‌ర స‌మాచారం ఏదీ వెల్లడించలేదు. అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన వ్యక్తిపై పోలీస్ ఆఫీస‌ర్లు ఎవ‌రూ కాల్పులు జ‌ర‌ప‌లేద‌ని స్పష్టం చేశాడు.