Shilpa Chowdary Cheating Case: కిట్టీ పార్టీలతో మొదలుపెట్టి.. కోట్లు కొల్లగొట్టిన శిల్పాచౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శిల్పా కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు ముందు నోర విప్పిన శిల్ప.. రాధికా రెడ్డి అనే రియల్టర్ తనను మోసం చేసిందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. శిల్ప ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రియల్ ఎస్టేట్ తోపాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతున్న టంగుటూరు రాధికా రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. తర దగ్గర ఆరు రూపాయల వడ్డీకి రాధికారెడ్డి ఆరు కోట్లు తీసుకుందని విచారణలో శిల్ప వెల్లడించింది. టంగుటూరు రాధికా రెడ్డి జన్వాడలో నివాసముంటోంది. ఫ్లోరిస్ట్ గా ఈవెంట్స్ చేస్తున్న రాధికా రెడ్డి రూ.10 రూపాయల వడ్డీతో కోట్ల రూపాయల తీసుకున్నట్లు శిల్ప తెలిపింది. కాగా.. రాధికారెడ్డి సోమవారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.
తన స్థాయిని పెంచుకునేందుకు శిల్ప రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. శిల్ప సిత్రాల్లో బౌన్సర్లు తెరపైకి వచ్చినట్లు వెల్డించింది. బిల్డప్ కోసం… స్టేటస్ సింబల్‌గా బౌన్సర్లను నియమించుకున్నట్టు చెప్పింది. మరో కొత్త విషయం ఏమిటంటే.. ఆమె రెండేళ్లు అమెరికాలో ఉండి వచ్చినట్లు తేలింది. అయితే.. శిల్పా ఎందుకు వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. అక్కడ కూడా డీలింగ్స్ చేశారా.. అనే కోణంలోను ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అన్ని విషయాలను, రాధికారెడ్డి అనే రియల్టర్ మోసం చేసిందనే విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్తున్న శిల్పా చౌదరి.. ఆర్థిక లావాదేవీలపై మాత్రం నోరు మెదపడం లేదు. తనని పోలీసులు అరెస్టు చేశాక.. మైండ్ బ్లాంక్ అయిందని.. జైలుకెళ్లాక మతిస్థితిమితం బాగోలేదంటూ చెప్తోంది. రోజుకో డ్రామా… పూటకో మాటలో ఈ డైలాగ్ భాగమనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
మరోవైపు.. శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి..స్టేట్‌మెంట్ సమర్పించారు పోలీసులు. తర్వాత చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. ఈ ఘరానామోసం కేసులో టంగుటూరి రాధికారెడ్డి ఎంట్రీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆమె ఏకంగా పది రూపాయల వడ్డీకి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు తేలింది. ఆ డబ్బంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ మీదే పెట్టారా.. ఇతర రూపాల్లో మళ్లించారా.. అన్నది లెక్క తేలాల్సి ఉంది. ఈ కేసులో రాధికారెడ్డిని పోలీసులు సోమవారం విచారణ చేయనున్నారు.
Also Read: