Hathras murder: యూపీలోని హత్రాస్ లో మళ్ళీ సేమ్ క్రైమ్, అత్యాచార బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన దుండగులు

Hathras rape case: గత ఏడాది యూపీ లోని హత్రాస్ ఘటన ఇంకా ప్రజల కళ్ళముందు నుంచి చెరిగిపోకముందే మళ్ళీ ఈ జిల్లా  వార్తలకెక్కింది. హత్రాస్ లో  అత్యాచార బాధితురాలి తండ్రిని  కీచక దుండగుడు,..

Hathras murder: యూపీలోని హత్రాస్ లో మళ్ళీ సేమ్ క్రైమ్,  అత్యాచార బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన దుండగులు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 02, 2021 | 10:34 AM

గత ఏడాది యూపీ లోని హత్రాస్ ఘటన ఇంకా ప్రజల కళ్ళముందు నుంచి చెరిగిపోకముందే మళ్ళీ ఈ జిల్లా  వార్తలకెక్కింది. హత్రాస్ లో  అత్యాచార బాధితురాలి తండ్రిని  కీచక దుండగుడు,  అతని స్నేహితులు కాల్చి చంపారు. 2018 లో ఈ బాధితురాలిపై  గౌరవ్ శర్మ అనే దుండగుడు రేప్ కి పాల్పడ్డాడు. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి… ఆ తరువాత బెయిల్ పై విడుదల చేశారు. కాగా తనపై ఫిర్యాదు చేసిందన్న కక్షతో గౌరవ్ శర్మ తన పగ తీర్చుకునేందుకు  సమయం కోసం వేచి ఉన్నాడు. గత నెల 28 న బాధితురాలి కుటుంబం ఆలయానికి వెళ్లగా గౌరవ్ శర్మ కూడా తన స్నేహితులతో అక్కడికి చేరుకున్నాడు. అప్పుడే అక్కడికి వఛ్చిన ఈమె తండ్రితో అతడు గొడవ పడ్డాడు. నీ కూతురి చేత నాపై పోలీసులకు ఫిర్యాదు చేయిస్తావా అంటూ మండిపడ్డాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఆగ్రహించిన శర్మ  గన్ తీసి ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఛాతీ, శరీర ఇతర భాగాలపై ఫైర్ చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణమంతా నెత్తురోడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాల్పులు జరిపిన శర్మ, అతడి స్నేహితులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కాగా హాస్పిటల్ లో తన తండ్రిని చూడడానికి వఛ్చిన బాధితురాలు అదేపనిగా విలపిస్తూ.. తనకు న్యాయం జరగాలని, తనపట్ల కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని కోరుకుంది. తనపై అత్యాచారం చేసిన నిందితుడిని ఆమె పోలీసులకు చూపింది. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. కాగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అటు కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఇలా అత్యాచారాలు, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నా మీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతూ ట్వీట్ చేసింది.

hathras victim begs for justice for her father’s killing,