Adilabad teacher harassment: ఓ కీచక టీచర్ బాగోతం బయటపడింది. పాఠాలు చెప్పాల్సిన అతగాడు.. స్టూడెంట్స్‌కు నీలి చిత్రాలు చూపించాడు. అంతేకాదు.. వారితో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో.. సదరు ఉపాధ్యాయుడి తాట తీసేంత పనిచేశారు.
ఆదిలాబాద్ తాంసి మండలం.. గుర్తుందా? మొన్నీ మధ్య ఈ మండలంలోని MEO పేకాట ఆడుతూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత సస్పెండ్ అయ్యాడు. మండల విద్యాశాఖాధికారే ఇలా ఉంటే ఇక ఆ మండలంలోని స్కూళ్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇంకోసారి బయటపడింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు.. పర్వర్ట్లా ప్రవర్తించాడు. తనలో దాగి ఉన్న వికృత బుద్దిని బయటపెట్టాడు. ఘోట్కూరి స్కూల్లో.. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఖాదీర్ ఈ నీచానికి పాల్పడ్డాడు. ఏకంగా స్కూల్లో అమ్మాయిలకు బ్లూ ఫిల్మ్ చూపించడంతో విషయం తల్లిదండ్రులకు చేరింది. దాంతో స్కూళ్లోనే వాళ్లు పంచాయతీ పెట్టారు. సదరు ఉపాధ్యాయుడిని బంధించి.. ఏంటీ సంగతని నిలదీశారు. బ్లూఫిల్మ్ బాగోతం వెలుగుచూడడంతో కన్నవారు ఆగ్రహంతో రగిలిపోయారు. ఖాదరు గతంలో కూడా ఇదే తరహా ప్రవర్తించాడని చెబుతున్నారు గ్రామస్తులు. మరోసారి అతని అసభ్యకర ప్రవర్తనతో మళ్లీ దొరికిపోయాడన్నారు. హెచ్ఎం ఖాదీర్ను బంధించిన గ్రామస్తులు.. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దాంతో కొందరు అధికారులు పాఠశాలకు వచ్చి చర్చించారు. విద్యార్ధుల జీవితాలను నాశనం చేసేందుకు చూస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా అయితే తమ బిడ్డల్ని బడికి ఎలా పంపేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు.. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూస్తామన్నారు. అయినప్పటికీ.. ఆ కీచక ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ గ్రామస్తులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.
కన్నవారి ఆవేదన కరెక్టే. చదువు చెప్పాల్సిన గురువులే ఇలా చేస్తే.. ఇది పిల్లలను బడికి పంపేది ఎలా. ఇలాంటివారే సమాజానికి హానికరం. ఉపాధ్యాయ వృత్తికి అవమానకరం. కేవలం వృత్తిపరమైన చర్యలు మాత్రమే కాకుండా న్యాయపరంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
Also Read: