అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అలబామా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం నాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి

Edited By:

Updated on: Jun 05, 2020 | 9:48 PM

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అలబామా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం నాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 11 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. మౌంటీ కౌంటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని ఆ ఇంటిని చెక్ చేశారు. లోనికి వెళ్లి చూడగా.. ఏడుగురు మరణించి పడి ఉండటాన్ని గుర్తించారు. మరోవైపు కొన్ని వస్తువులు ఇంట్లో కాలిపోవడాన్ని గమనించి మంటలను ఆర్పేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కాల్పుల ఘటనకు ఎవరు కారణమన్నది ఇంకా తెలియరాలేదని.. ఎవరిని కూడా ఈ కేసు సంబంధించి అదుపులోకి తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలావుంటే.. గతకొద్ది రోజులుగా అమెరికాలో గన్‌ కల్చర్ విపరీతంగా పెరిగింది.