టీవీ నటి మిస్సింగ్..గాలిస్తోన్న పోలీసులు

|

Jun 27, 2019 | 6:09 AM

ఇటీవల కాలంలో హైద్రాబాద్‌లో మిస్సింగ్ కేసుల వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీరంతా నిజంగానే మిస్ అవుతున్నారా?  లేక ఎవరైనా వదంతలు సృష్టిస్తున్నారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. సీరియల్స్ లో నటించే ఓ నటి మిస్సింగ్ కలకలం రేపుతోంది. వారం రోజులుగా అడ్రస్ లేకపోవటం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ సీరియల్ నటి పేరు లలిత. అనంతపురం జిల్లా ధర్మవరం లలిత స్వగ్రామం. నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది. అమీర్ […]

టీవీ నటి మిస్సింగ్..గాలిస్తోన్న పోలీసులు
Follow us on

ఇటీవల కాలంలో హైద్రాబాద్‌లో మిస్సింగ్ కేసుల వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీరంతా నిజంగానే మిస్ అవుతున్నారా?  లేక ఎవరైనా వదంతలు సృష్టిస్తున్నారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. సీరియల్స్ లో నటించే ఓ నటి మిస్సింగ్ కలకలం రేపుతోంది. వారం రోజులుగా అడ్రస్ లేకపోవటం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ సీరియల్ నటి పేరు లలిత. అనంతపురం జిల్లా ధర్మవరం లలిత స్వగ్రామం. నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది. అమీర్ పేట్ లోని ఓ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. నటనపై ఆసక్తిగా ప్రయత్నం చేయగా.. కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పటికి కూడా నటిస్తూనే ఉంది. ప్రేమ, కళ్యాణ వైభవం, స్వర్ణఖడ్గం అనే సీరియల్స్ లలిత నటిస్తున్నట్లు చెబుతున్నారు.

వారం క్రితం అమీర్ పేటలోని ఒక హాస్టల్ లో ఉంటున్న టీవీ నటి లలిత మిస్ అయిన ఉదంతాన్ని గుర్తించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన లలిత పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఉంటుంది. ఈ నెల 11న ఆమె పేరెంట్స్ ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో పలు విధాలుగా ప్రయత్నించారు. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఆమె పేరెంట్స్  ఆరా తీయగా.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారని.. అతడి వెంట వెళ్లిన విషయాన్ని హాస్టల్ కు చెందిన వారు చెబుతున్నట్లు తెలిసింది.

లలిత నటిస్తున్న సీరియల్స్ పలు టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్నాయి. ఇదిలా ఉంటే బన్నీ అనే వ్యక్తి లలితను తన వెంట తీసుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో.. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో లలిత తల్లిదండ్రులు తమ కుమార్తె మిస్సింగ్ విషయంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.