Farmers Protest – Singhu Border: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదిగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, ఘాజీపూర్ బోర్టర్ల వద్ద రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ తరుణంలో రైతులు ఉద్యమిస్తున్న సింఘు బోర్డర్ వద్ద దారుణం చోటుచేసుకుంది. రైతులు నిరసన తెలుపుతున్న ప్రధాన వేదికకు సమీపంలో ఓ వ్యక్తి (35) దారుణ హత్యకు గురయ్యాడు. వేదికకు సమీపంలో ఉన్న బారికేడ్‌కు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. మణికట్టును కత్తిరించి దారుణంగా హత్య చేసినట్లు పేర్కొంటున్నారు. దీంతో సింఘు బోర్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని కుండ్లీ పోలీసులు వెల్లడించారు.
కాగా.. వ్యక్తి హత్య అనంతరం రైతులు నిరసనకు దిగారు. తమన నిరసనకు భంగం కలించేందుకు కొంతమంది కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఇది పంజాబ్, హర్యానా ప్రధాన వర్గంలోని తిరుగుబాటుదారులైన నిహంగాల పనేనని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తునకు పోలీసులకు సహకరిస్తామని ఎస్‌కేఎం వెల్లడించింది.
Also Read: