Tamil Nadu Whip Baba: ఎంతటి అమానవీయం.. ఎంతటి అనాగరికం.. విజ్ఞాన కాలంలో అజ్ఞానం అలుముకుంది అనడానికి సాక్ష్యమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన. ఓ అరవ వేషగాడి వికృత చేష్టలకు అమాయకులు ఆసుపత్రులపాలవుతున్నారు.
అంతరిక్షంలో నిగూఢ రహస్యాలు చేధిస్తున్న ఈ కాలంలో కూడా.. రోజుకో దొంగ బాబాలు, స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. తమిళనాడులో స్వామీజీ అవతారమెత్తిన ఓ నీచ్ కమిన్.. బాబా, అక్కడికి వచ్చిన మహిళలను ఇలా చిత్రహింసలు పెడుతున్నాడు. ఆడవాళ్లనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. ప్రవర్తిస్తున్నాడు. మూఢనమ్మకాలతో వచ్చిన వారిపై మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడు.
ఇతని వేషమే పెద్ద విచిత్రంగా ఉంది. మొహమంతా విభూదీ రాసుకున్నాడు. కోయదొర మాదిరి భుజానికి పట్టాలాంటిది వేసుకున్నాడు. షార్ట్ వేసుకుని.. నడుముకు గంటల దండ కట్టుకున్నాడు. కాళ్లకు గజ్జెలు కట్టుకున్నాడు. అట్టలు కట్టిన జడల జుట్టుతో చూడ్డానికే వికారంగా ఉంది ఇతని అవతారం.
రోగాలు నయం చేస్తా.. దెయ్యాలు వదిలిస్తా.. సమస్యలు తీరుస్తా.. అంటూ అవతార పురుషుడి మాదిరిగా చెప్పుకున్నాడు. ఈ దొంగ స్వామి బురిడీ మాటలు నమ్మిన అమాయకులు.. వీడి దగ్గరకు క్యూకట్టారు. వచ్చిన వారిని ఇలా చిత్రహింసలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
దెయ్యం పట్టిందంటూ అక్కడికి వచ్చిన మహిళలను కొరడా, కర్రలతో చితకబాదుతున్నాడు. జట్టుపట్టుకుని ఈడుస్తూ వెర్రి కేకలు వేస్తున్నాడు. బెత్తంతో ఆమె వీపు మీదే కాదు.. ఒళ్లంతా హూనమయ్యేలా కొట్టాడు. నొప్పి పుడుతోంది వదిలెయ్యి స్వామీ.. అని వేడుకున్నా, కనీస కనికరం కూడా చూపలేదు. జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి.. వీపును కాలుతో తొక్కిపెట్టి పిచ్చి కేకలు వేస్తున్నాడు. కాలుతో వీపు మీద తంతూ వెర్రి చేష్టలు ప్రదర్శించాడు.
ఈ ఉన్మాదం.. తమిళనాడు, నామక్కల్ జిల్లాలోని కాదపల్లి గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉన్న కరుప్పుస్వామి ఆలయంలో ఈ తతంగం అంతా జరిగింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారాయి.
ఏంటీ మూఢత్వం.. ఎందుకింత మూర్ఖత్వం. కొరడాలతో కొట్టించుకుంటే రోగాలు నయం అవుతాయా? కాలితో తన్నిచ్చుకుంటే దెయ్యాలు వదులుతాయా? జుట్టు పట్టి పీకితే సమస్యలు తొలగిపోతాయా? ఏంటీ దారుణం. ఎటు పోతున్నాం.. సమస్యల నుంచి వాడు చెప్పుకున్నాడు. సరే. మన బుద్ధి ఏమైంది. ప్రతి పగటి వేషగాడి దగ్గరకు వెర్రి మొహాలతో ఎగేసుకుని పోవడమేనా.
కొంచెమైనా ఆలోచనా జ్ఞానం ఉండాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.