వాట్సాప్‌లోని ఈ మెసేజ్‌లతో.. బీ కేర్‌ ఫుల్!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వాడని వ్యక్తి లేరనే చెప్పాలి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లలు సైతం వాట్సాప్‌ని వాడుతున్నారు. అందులోనూ లాక్‌డౌన్‌తో దీని వినియోగం మరింత పెరిగింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన...

వాట్సాప్‌లోని ఈ మెసేజ్‌లతో.. బీ కేర్‌ ఫుల్!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 4:48 PM

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వాడని వ్యక్తి లేరనే చెప్పాలి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లలు సైతం వాట్సాప్‌ని వాడుతున్నారు. అందులోనూ లాక్‌డౌన్‌తో దీని వినియోగం మరింత పెరిగింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వ్యక్తులు వాట్సాప్ ద్వారా వారి కుటుటంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ క్రైమ్ నేరగాళ్లు మరో కొత్త ఆలోచనకు తెరదింపారు.

ఇప్పటివరకూ నార్మల్ మెసేజ్‌ల రూపంలో లేదా మెయిల్స్‌కి వివిధ రకాల మెసేజ్‌లు పంపిస్తూ.. ప్రజలను మోసం చేసేవారు. ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా కూడా ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇది తెలియని వినియోగదారులు ఆ మెసేజ్ ఓపెన్ చేసి స్కామర్ల చేతిలో చిక్కుకుపోతున్నారు.

ఇది గమనించిన ఓ యూజర్.. ఆ మెసేజ్‌ని స్క్రీన్‌ షాట్ తీసి.. ట్విట్టర్‌ ద్వారా.. wabetainfoకు ట్వీట్ చేసి.. వెరిఫై చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి సమాధానంగా ఇది పూర్తిగా ఫేక్ అని వచ్చింది. ‘ఇటువంటి మెసేజ్‌లు వాట్సాప్ ఎప్పుడూ చేయదు. వాట్సాప్ సంస్థ ఏదన్నా చెప్పాలనుకున్నా.. అఫీషియల్‌గానే ప్రకటిస్తుంది. ఒకవేళ మెసేజ్‌లు వచ్చినా.. గ్రీన్‌ కలర్ ఉండే టిక్‌ మార్క్ ఉంటుంది. దాన్ని చూసైనా జాగ్రత పడండి’ అంటూ రిప్లై వచ్చింది.

ఎవరైనా మీ ఫోన్‌ను హ్యాక్ చేయాలనుకుంటే వారు ఎస్ఎమ్ఎస్ వెరిఫికేషన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది లేకుండా ఏ యూజర్ అయినా వెరిఫికేషన్ పద్దతి పూర్తి చేయలేడు. కాబట్టి ఇలాంటి మెసేజ్‌లను పట్టించుకోకుండా ఉండటమే మంచిది.

Read More:

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!