నగరంలో హైటెక్ సెక్స్ రాకెట్.. నెలకు జీతం కూడా.. అసలు విషయం తెలిస్తే షాక్ తినాల్సిందే.

మనీష్‌ శర్మ, దీపక్‌ చంద్‌.. వీరిద్దరు వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారమంటే అలాంటి ఇలాంటి వ్యాపారం కాదు. వ్యాపారం ముసుగులో వ్యభిచారం. అది కూడా అలాంటి ఇలాంటిది కాదు. హైటెక్ సెక్స్ రాకెట్‌లోనే కొత్త యాంగిల్. అమ్మాయిలకు నెలకు జీతం ఇస్తూ.. దందా సాగిస్తుంటారు. 2016 గతంలో వీరు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ సేమ్ దందాకు తెరలేపారు. […]

నగరంలో హైటెక్ సెక్స్ రాకెట్.. నెలకు జీతం కూడా.. అసలు విషయం తెలిస్తే షాక్ తినాల్సిందే.

Edited By:

Updated on: Jan 02, 2020 | 9:45 PM

మనీష్‌ శర్మ, దీపక్‌ చంద్‌.. వీరిద్దరు వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారమంటే అలాంటి ఇలాంటి వ్యాపారం కాదు. వ్యాపారం ముసుగులో వ్యభిచారం. అది కూడా అలాంటి ఇలాంటిది కాదు. హైటెక్ సెక్స్ రాకెట్‌లోనే కొత్త యాంగిల్. అమ్మాయిలకు నెలకు జీతం ఇస్తూ.. దందా సాగిస్తుంటారు. 2016 గతంలో వీరు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ సేమ్ దందాకు తెరలేపారు.

ఈ సారి నగరంలోని దందా సెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతే అనుకున్నదే తడవుగా.. రాజేంద్ర నగర్‌లో ఓ త్రిపుల్ బెడ్ రూం రెంట్‌కు తీసుకున్నారు. పాత పరిచయాలతో.. ముంబై, ఢిల్లీ ప్రధాన నగరాల్లోని యువతుల(సెక్స్ వర్కర్లు)ను తీసుకొచ్చారు. అది కూడా కండిషన్స్‌తో. నెలకు జీతం ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుని. అయితే జీతం ఇస్తాం కానీ కండిషన్స్ అప్లై అన్నట్లు పలు షరతులు కూడా పెట్టారు. అయితే రెసిడెన్షియల్ ఏరియాలో ఈ దందా కొనసాగిస్తున్నారు ఈ ముఠా. తరచూ వీరు ఉంటున్న అద్దె ఇంటికి యువకుల తాకిడి పెరగడంతో.. చుట్టుపక్కల వారికి అనుమానాలు తలెత్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ప్లాట్‌పై ఓ లుక్ వేశారు. ఆదివారం రోజు సడన్‌గా ప్లాట్‌పై రైడ్ జరిపారు. అంతే… సీన్ కట్ చేస్తే హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టైంది.

నిర్వాహకులు మనీష్‌ శర్మ, దీపక్‌ చంద్‌‌తో పాటు ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆరుగురు సెక్స్‌వర్కర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఫ్లాట్‌లో 4 సెల్‌‌ఫోన్లతో పాటు.. నగదు, భారీగా కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మనీష్‌ శర్మ, దీపక్‌ చంద్‌ 2016లో కూడా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. జైలుకెళ్లిన తర్వాత.. బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆ తర్వాత మళ్లీ అదే దందా కొనసాగించారు.

అమ్మాయిలతో కండిషన్స్‌తో దందా..

ఢిల్లీ, ముంబయి సిటీల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకువచ్చి.. వారితో దందా కొనసాగిస్తున్నారు. రెండు వారాల క్రితమే రాజేంద్రనగర్‌లో ఫ్లాట్‌ను రెంట్‌కు తీసుకుని సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న సెక్స్ వర్కర్లకు నిర్వాహాకులు నెలకు రూ.25వేల జీతం కూడా ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే జీతం ఇచ్చేందుకు కండిషన్స్ కూడా పెట్టారని విచారణలో తేలింది. ప్రతి ఒక్క సెక్స్ వర్కర్ దగ్గరికి రోజుకు 10 మంది కంటే ఎక్కువ మంది కస్టమర్లను పంపిస్తుంటారని పోలీసుల విచారణలో బహిర్గతమైంది.