Road Accident: వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా విషాదం.. చెట్టును ఢీకొన్న జీపు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి..

|

Apr 21, 2022 | 1:02 AM

Karnataka: కర్ణాటకలోని మైసూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించంది. హున్‌సూర్‌లోని కల్లహల్లి సమీపంలో ఓ జీపు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది.

Road Accident: వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా విషాదం.. చెట్టును ఢీకొన్న జీపు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి..
Road Accident
Follow us on

Karnataka: కర్ణాటకలోని మైసూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించంది. హున్‌సూర్‌లోని కల్లహల్లి సమీపంలో ఓ జీపు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొడుగులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని మైసూర్‌ తిరిగి వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు పోలిబెట్టకు చెందిన అనిల్‌, సంతోష్‌, రాజేష్‌, వినూత్‌, బాబు, దయానంద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.

కాగా వీరంతా రెండు వాహనాల్లో వివాహ వేడుకకు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కారులో, మహిళలు, చిన్న పిల్లలు మరో కారులో ఉన్నారని వారు తెలిపారు. ప్రమాదవశాత్తూ జీపు చెట్టును ఢీకొట్టడం వల్ల డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదుచేశామన్నారు.

Also Read:Kieron Pollard: కీరన్‌ పొలార్డ్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు.. ఆందోళనలో ముంబై ఫ్యాన్స్‌..

Coconut Water Benefits: ప్రతిరోజూ ఒక్క గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు లాభాలు.. హైబీపీతో పాటు అనేక సమస్యలకు చెక్..

VK Sasikala: శశికళను చుట్టుముడుతున్న కష్టాలు.. పోలీసుల నుంచి మళ్లీ పిలుపు.. ఎందుకోసమంటే..!