
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బుల్లియ్య అనే వ్యక్తి ట్రాక్టర్ టైర్ పంక్ఛర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. ఈ క్రమంలో అటుగా వేగంగా బైక్ పై వస్తున్న కసూర్తయ్య అనే వ్యక్తి అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కస్తూరయ్యతో పాటు ట్రాక్టర్‌కు మరమ్మతులు చేస్తున్న బుల్లియ్య సైతం తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
ఆ టూవీలర్ చలాన్లను చూసి కంగుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇంతకీ ఎంతంటే..?