Darbhanga blast case: తండ్రి యోధుడు.. కొడుకులు మాత్రం కేటుగాళ్లు.. ఎందుకిలా..?

| Edited By: Ravi Kiran

Jul 03, 2021 | 4:43 PM

దర్భంగా బ్లాస్ట్ ఉగ్రవాదుల కుటుంబ నేపథ్యం సంచలనంగా మారింది. మాలిక్ సోదరుల తండ్రి మూసాఖాన్‌..ఇండియన్ ఆర్మీ మాజీ సైనికుడు. యూపీలో ఒక చిన్న దుకాణం నడుపుతున్న మూసాఖాన్‌కు నలుగురు కుమారులు. మహమ్మద్ ముసాఖాన్ 1965 పాకిస్థాన్ వార్‌తో పాటు పలు యుద్ధాల సమయంలో దేశానికి సేవలందించారు.

Darbhanga blast case: తండ్రి యోధుడు.. కొడుకులు మాత్రం కేటుగాళ్లు.. ఎందుకిలా..?
Retired Indian Army Soldier
Follow us on

దర్భంగా బ్లాస్ట్ టెర్రరిస్టుల కుటుంబ నేపథ్యం ఇప్పుడు సంచలనంగా మారింది. మాలిక్ సోదరుల తండ్రి మూసాఖాన్‌.. ఇండియన్ ఆర్మీ మాజీ సైనికుడు. యూపీలో ఒక చిన్న దుకాణం నడుపుతున్న మూసాఖాన్‌కు నలుగురు కుమారులు. మహమ్మద్ ముసాఖాన్ 1965 పాకిస్తాన్ వార్‌తో పాటు పలు యుద్ధాల సమయంలో దేశానికి సేవలందించారు.

తండ్రి యోధుడు…

దర్భంగా పేలుడు ఘటనలో ప్రధాన నిందితుల తండ్రి భారత సైనికుడు. ఆయన పేరు మూసాఖాన్‌.. భారత ఆర్మీలో పని చేసిన యోదుడు. అతను అందించిన సేవలకు గుర్తుగా 29 మెడల్స్ పొందారు మూసా. చిన్న వయస్సులోనే ఆర్మీలో సైనికుడిగా చేరిన మహమ్మద్ ముసాఖాన్ 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత 1965 పాకిస్తాన్ వార్‌తో పాటు పలు యుద్ధాల సమయంలో దేశానికి సేవలందించారు. మూసా భారత సైనికుల తరఫున కీలకపాత్ర పోషించిన ఆయన ఆ యుద్ధం తర్వాత పదవీ విరమణ పొందారు. మూసా.. ఆ తర్వాత… ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తర్వాత తన స్వగ్రామం ఖైరానానగర్‌లోనే స్థిర పడ్డారు. వంట సామాగ్రి విక్రయించే షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు.

 పాకిస్తాన్‌ లింక్ కలిసింది ఇలా…

రెండు నెలల క్రితం వరకు ఇమ్రాన్‌ ఖాన్‌ తండ్రి దుకాణంలోనే ఉంటూ ఆ వ్యాపారంలోనే ఉంటూ సహకరించాడని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్‌లో ఉంటున్న ఇక్బాల్‌ ఖాన్‌తో పరిచయమైంది.

ఇక్బాల్ ఖాన్ ఎవరూ..?

పాక్‌ నిఘా సంస్థ ISI కోసం పని చేస్తున్నాడు. ఇతగాడు భారత్‌ ఏజెన్సీలకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఇక్బాల్‌పై నకిలీ నోట్ల సరఫరా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వంటి అనేక కేసులు ఉన్నాయి. ఇతడి ఆదేశాలతో 2012లో తన బంధువుల వద్దకు వెళ్తున్నట్లు వీసా తీసుకున్న ఇమ్రాన్‌ పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడి ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్నLeT ట్రైనింగ్‌ క్యాంప్‌లో నాలుగు నెలల పాటు ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు.

ఇదిలావుంటే.. ఈ ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు శుక్రవారం పట్నాలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో పట్నా సెంట్రల్‌ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి : Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోవడంతో..

Horoscope 3 July 2021:ఆర్ధికంగా లాభం చేకూరాలంటే.. ఈ రోజు ఏయే రాశులవారు ఏ దేవతలు పూజించాలంటే